బీట్ షెమేష్, మార్చి 3 : తన గొప్ప స్నేహితుడు ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడానని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలబడినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.
ఇజ్రాయెల్‌లోని బీట్ షెమెష్‌లో ఓ ప్రార్థనా మందిరంపై ఇరాన్ జరిపిన దాడుల్లో 9 మంది మరణించగా ఆ ప్రదేశంలోని శిథిలాలను నెతన్యాహు తన అంగరక్షకుల మధ్య సోమవారం సందర్శించారు. నాకు గొప్ప స్నేహితుడైన నరేంద్ర మోదీ తో నిన్న సుదీర్ఘంగా మాట్లాడాను. ఇజ్రాయెల్‌కు, సత్యానికి అండగా నిలబడినందుకు, భారత ప్రజల అపార మైత్రికి కృతజ్ఞతలు తెలిపాను అని నెతన్యాహు చెప్పారు.