న్యూఢిల్లీ, మార్చి 3 : ఇరాన్‌పై భారీ సైనిక చర్యను అమెరికా చేపట్టిన కొన్ని గంటల తర్వాత నిర్వహించిన ఓ సర్వే ప్రకారం అమెరికన్ ప్రజల్లో పావు వంతు మంది మాత్రమే ఈ దాడులను సమర్థించారు. రాయ్‌టర్స్ ఇప్సోస్ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైన ఈ పోల్ సర్వే ఆదివారం ముగిసింది.
ఇరాన్‌పై జరిపిన సైనిక దాడిలో కొందరు అమెరికన్ సైనికులు మరణించినట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడానికి ముందు జరిగిన ఈ పోల్‌లో అమెరికా-ఇజ్రాయెల్ కలసి ఇరాన్‌పై జరుపుతున్న దాడులను నలుగురు అమెరికన్లలో ఒకరు మాత్రమే సమర్థించారు.