కొత్త ఆవిష్కరణల

- ఆకట్టుకుంటున్న రీజినల్ సైన్స్ సెంటర్
- అబ్బురపరిచే ఎగ్జిబిట్లతో కట్టిపడేస్తున్న విజ్ఞాన కేంద్రం
- విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా బోధన, పరిశోధనా అంశాలు
వరంగల్‌లోని రీజినల్ సైన్స్ సెంటర్ ఓ విజ్ఞాన కేంద్రంగా మారింది. విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి పెంచడంతో పాటు వారి మేథాశక్తితో కొత్త కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలకు దోహదపడేలా సుమారు 69 రకాల ఎగ్జిబిట్లను ఏర్పాటుచేసింది. టీఎస్ కాస్ట్(తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) పర్యవేక్షణలో కొనసాగుతున్న ఈ కేంద్రంలో ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ పాఠ్యాంశాలతో పాటు మానవ జీవన విధానం, మానవ సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడేలా తీర్చిదిద్దడంతో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
హన్మకొండ, ఫిబ్రవరి 18 :హన్మకొండలోని కాకతీయ జూపార్క్ ఎదుట ఎత్తైన కొండపై నిర్మించిన రీజినల్ సైన్స్‌సెంటర్ వరంగల్ నగరానికి మణిహారంగా మారింది. 2008లో తెలంగాణ రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక మండలి(టీఎస్ కాస్ట్), రాష్ట్ర పర్యావరణ, అడవులు, శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో దీనికి రూపకల్పన చేశారు. 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.5.27 కోట్లతో మూడు అంతస్తుల్లో సైన్స్ సెంటర్‌ను నిర్మించగా 2015 నుంచి సందర్శకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు.
స్వాగతం పలికే ఈజిప్టు శిల్పం
బంగారు రంగులో మెరిసే ఈజిప్టు శిల్పం సైన్స్ సెంటర్‌కు వెళ్లగానే స్వాగతం పలుకుతుంది. గాలిలో ధ్వని వేగానికి సంబంధించిన అంశాలను ఈ ఎగ్జిబిట్ ద్వారా తెలుసుకోవచ్చు. మొదటి అంతస్తులో మ్యూజిక్ నీటి కుళాయి ఆకర్షిస్తుంది.
గ్రహాలపై బరువు తెలుసుకోవడం..
సాధారణంగా మనం వేయింగ్ మిషన్‌పై మాత్రమే మన బరువును చూసుకోగలం. కానీ సైన్స్ సెంటర్లో ఉన్న మిషన్ ద్వారా వివిధ గ్రహాలపై మానవ శరీర బరువును తెలుసుకోవచ్చు. ఇక్కడి ‘యువర్ వెయిట్ ఆన్ డిఫరెంట్ ప్లానెట్స్' అనే విధానంలో బరువును తూచే పరికరం ఉంది. వేయింగ్ మిషన్‌కు, గ్రహాల చిత్రాలను కలుపుతూ రూపొందించిన ఎగ్జిబిట్పై వేలు పెడితే చాలు బరువు తెలియజేస్తుంది.
నూతన ఆవిష్కరణలకు ప్రేరణ
రీజినల్ సైన్స్ సెంటర్ విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలకు దోహదపడుతుంది. సైన్స్ సెంటర్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఉపయోగపడుతుంది.
- కటంగూరి రాంగోపాల్‌రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా ఎన్ఎస్సీ కో ఆర్డినేటర్
15 నుంచి అనుమతిస్తున్నాం..
కరోనా నేపథ్యంలో గత మార్చి నుంచి మూసివేసిన సైన్స్ సెంటర్‌ను ఈ నెల 15 నుంచి సందర్శకులకు అందుబాటులోకి తీసుకువచ్చాం. సందర్శకులు తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించాలి. సెంటర్ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. పాఠశాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో రీజినల్ సైన్స్ సెంటర్‌ను సందర్శించి మేధస్సును పెంపొందించుకోవాలి.
- వీ వెంకటేశ్వర్రావు, సైన్స్ సెంటర్ ప్రతినిధి
ప్రత్యేకాకర్షణగా ‘అనంత’ రైలు
మొదటి అంతస్తులో ఇది ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎదురెదురుగా ఉన్న రెండు దర్పణాల (అద్దాలు) మధ్య సున్నా కోణం డిగ్రీలతో అమర్చారు. కేవలం ఒకే దర్పణంపై పంట పొలాలకు సంబంధించిన చిత్రాన్ని అతికించారు. ఈ రెండు దర్పణాల మధ్య కోణం సున్నా ఉండేలా బిగించడం వల్ల అన్ని అద్దాలపై అదే రైలు చిత్రం మళ్లీ మళ్లీ కనిపిస్తుంది. వీటి మధ్య సరుకులు తరలించే గూడ్స్ రైలు నమూనాను పెట్టారు. అనంతమైన ప్రతిబింబాల మధ్య ఉన్నందున ఎగ్జిబిట్లో అమర్చిన రైలు అనంతంగా కనిపిస్తుంది.
తాజావార్తలు
- వామన్‌రావు దంపతుల హత్య బాధ కలిగించింది : కేటీఆర్
- 18 ఏళ్లకే ముద్దు పెట్టేశా.. ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్
- కందకుర్తి సరిహద్దులో ఇంజక్షన్ కలకలం
- మార్కాపురంలో ఎన్నికల బహిష్కరణకు టీడీపీ నిర్ణయం.!
- బెంగాలీ నటుడికి నాని టీం వెల్కమ్
- కాళేశ్వరం గ్రావిటీ కెనాల్లో పడిన దుప్పి..
- మీ దంతాలు మిలమిలా మెరవాలంటే.. ఇలా చేయండి
- ఉరేసుకొని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
- పెండింగ్‌లో 4.73 లక్షల గ్రీన్‌కార్డు దరఖాస్తులు?!
- సడన్‌గా ఈ ‘గజకేసరి’ ఎక్కడ్నుంచి వచ్చాడు యశ్..?