ప్రమాదకరమైన దశలో ప్రపంచం : WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్
ప్రమాదకరమైన దశలో ప్రపంచం : WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ | కరోనా మహమ్మారితో ప్రపంచం ‘ప్రమాదకరమైన దశ’లో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసన్ హెచ్చరించారు. కొవిడ్ వైరస్ డెల్టా లాంటి వేరియంట్లు కాలక్రమేణా నిరంతరం మారుతున్నాయని ఆందోళన వ్యక్తం

జెనీవా : కరోనా మహమ్మారితో ప్రపంచం ‘ప్రమాదకరమైన దశ’లో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసన్ హెచ్చరించారు. కొవిడ్ వైరస్ డెల్టా లాంటి వేరియంట్లు కాలక్రమేణా నిరంతరం మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ జనాభాకు టీకాలు వేసిన దేశాల్లో ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య మళ్లీ పెరగడంపై ప్రారంభమైందని తెలిపారు. ఇప్పటికీ ఇంకా ఏ దేశం ప్రమాదం నుంచి బయట పడలేదని.. డెల్టా వేరియంట్ ప్రమాదకరమైందని, వైరస్ కాల క్రమేణా మారుతున్నందున నిరంతరం దాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. వేరియంట్‌ను 98 దేశాల్లో గుర్తించామని, చాలా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. కఠినమైన నిఘా, ప్రారంభంలో వ్యాధిని గుర్తించడం, ఐసోలేషన్ చేయడం ఇప్పటికీ ముఖ్యమేనన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం, రద్దీ ప్రదేశాలను నివారించడం, ఇండ్లను వెంటిలేషన్ చేయడానికి తగిన ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమని టెడ్రోస్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి ప్రతి దేశ జనాభాలో 70 శాతం మందికి కొవిడ్ టీకాలు వేసేలా చూడాలని ప్రపంచ నేతలను కోరారు. తక్కువ టీకాలు వేసిన దేశాల్లో వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు ఫార్ములాను పంచుకోవాలని ఫైజర్, బయో ఎన్‌టెక్, మోడెర్నా సంస్థలకు సూచించారు. దీంతో ఎక్కువగా టీకాలు ఉత్పత్తి చేసి, గ్లోబల్ ఇమ్యునైజేషన్ పెంచి మమహమ్మారి ఉధృతిని త్వరగా తగ్గించవచ్చన్నారు.
ఇవి కూడా చదవండి..
పొట్టలో గడబిడా?
వర్షాకాలంలో ఈ కాయలు తప్పనిసరిగా తినాలి..! ఎందుకంటే..?
దేశంలో 35కోట్లు దాటిన టీకాల పంపిణీ
భక్తులు లేకుండానే పూరీ జగన్నాథుడి రథయాత్ర
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
విమానం కూలి ఆరుగురు మృతి
Good news : వారికి.. సింగిల్ డోసు టీకాతో ‘డెల్టా’ నుంచి రక్షణ
పశ్చిమ గోదావరి : కల్వర్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

