హైదరాబాద్,జులై 2: ప్రతి సీజన్ లో లభించే కాయలు, పండ్లు తినడంద్వారా ఆయా సీజన్లో వచ్చే వ్యాధులను సులువుగా ఎదుర్కోవచ్చు. ఆ జాబితాలో ఆ కాకర కాయ చాలా ప్రధానమైంది.
వర్షాకాలంలో లభించే ఈ కాయలు తప్పనిసరిగా తినాలి.. పలు ఔషధగుణాలున్న ఈ కూరగాయలు తినడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బోడ కాకరవేర్లు, పువ్వులు, రసం, ఆకులు మొదలైనవి అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు.
ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత…
బోడకాకరకాయను పలుప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఆ కాకర కాయ అని ,తెలుగు రాష్ట్రాల్లో బోడకాకరకాయ అని ప్రాంతాల వారీగా ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. బోడకాకరలో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లుఉన్నాయి. అంతేకాదు విటమిన్ “సి”, విటమిన్ “డి 2, 3, విటమిన్ “హెచ్”, విటమిన్ “కె” వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా దీనికి చాలా ప్రాధాన్యత ఉన్నది. తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, దగ్గు, పలుఇన్ఫెక్షన్లు, పైల్స్, కామెర్లు, డయాబెటిస్, బీపీ వంటివి తగ్గించడానికి ఆ కాకరకాయ ఎంతో ఉపకరిస్తుంది. ముఖ్యంగా పక్షవాతం, జ్వరం, వాపు, అపస్మారక స్థితి, పాము కాటు, కంటి సమస్య, క్యాన్సర్, వంటి అనేక భయంకరమైన వ్యాధులను నయంచేసేందుకు దీనిని ఉపయోగిస్తారు.