చికెన్ ఉంటే చాలు లొట్టలేసుకుంటూ తింటాం. చికెన్ అంటే అంత ఇష్టం చాలామందికి. కొందరికైతే ప్లేట్లో ముక్కలేనిదే ముద్ద దిగదు. చికెన్ అంటే అంతలా పడి చచ్చిపోతారు కొందరు. పండగైనా పబ్బమైనా.. ఏదైనా చికెన్ తినాల్సిందే.
కొందరు చికెన్‌ను తినరు. హింసకు కొందరు వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే.. కోడిని కోయడం అంటే దాన్ని హింసించడమే అన్నట్టుగా మాట్లాడుతారు. ఈనేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఓ కోడి ఏడుస్తున్న వీడియో అది.
ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థ్యాంక్స్‌గివింగ్ డే(Thanksgiving 2021) నడుస్తోంది కదా. ఇతర దేశాల్లో థ్యాంక్స్‌గివింగ్ డేను పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఆరోజు ఖచ్చితంగా టర్కీ చికెన్‌ను తింటారు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు.
థ్యాంక్స్‌గివింగ్ డే వచ్చిందంటే చాలు.. వేలాది టర్కీ కోళ్ల తలలు తెగిపడాల్సిందే. వీడియోలో ఏడుస్తున్న కోడి కూడా టర్కీ కోడీనే. థ్యాంక్స్ గివింగ్ డే రోజు ఎంతమంది టర్కీ చికెన్‌ను తినబోతున్నారు. దాన్ని తినేముందు.. ఒకసారి ఈ వీడియో చూడండి అంటూ కోడి ఏడుస్తుండగా.. ఓ వ్యక్తి దాని తలను నిమురుతున్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఆ వీడియో చూసిన నెటిజన్లు.. ఇక మేము జన్మలో నాన్ వెజ్ ముట్టం అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయ్యో పాపం.. ఎందుకు ఏడుస్తోంది. థ్యాంక్స్‌గివింగ్ డే రోజు.. ప్లేట్లో కూర అయిపోతుందని ఏడుస్తుందేమో అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
If everyone who was planning on eating #turkey for #Thanksgiving tomorrow saw this, MANY of them would leave them off their plates. Pls RT! 🧡🦃🧡 pic.twitter.com/AOR9UqEL4F
— John Oberg (@JohnOberg) November 24, 2021
Thanksgiving is a good culture
— فرتوت (@Fartoot_hajar) November 24, 2021
But eating can not be the only way
What method do you suggest for Thanksgiving?
There are delicious meatless loafs & vegan gravy. We've ordered 4 of these meals, put some thyme & Bell's Seasoning in, plus my homemade stuffing, other noshes, add some Guinness & Bass Ale for Black & Tans & I'll be waddling in contentment. #Thanksgiving2021 pic.twitter.com/KFbfsagtdD
— Máirín☮️☘️🌱🌎 (@Jerseygirlnb1) November 24, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తనను తానే పెళ్లి చేసుకుంది.. తర్వాత విడాకులు ఇచ్చుకుంది.. అసలేంటి ఈమె స్టోరీ
Amazon Marijuana Scandal : గంజాయి స్కామ్‌లో బుక్కయిన అమెజాన్.. నెటిజన్ల ఫన్నీ మీమ్స్ వైరల్
బీరు గ్లాస్ ఎలా కిందపడిపోయిందో ఈ వీడియో చూసి చెప్పండి చూద్దాం
ఇదేందయ్యా ఇది.. జీవితంలో ఇటువంటి యాక్సిడెంట్‌ను ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో