రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఏంటో తెలుసా? రెడ్ సిగ్నల్‌ను జంప్ చేయడం. రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు రెడ్ సిగ్నల్‌ను జంప్ చేస్తే ఓకే కానీ… వాహనాలు వచ్చేది కూడా గమనించకుండా సిగ్నల్ జంప్ చేస్తే ఏమౌతుంది.. యాక్సిడెంట్ అవుతుంది. లేనిపోని తలనొప్పులు.
వాహనాన్ని డ్రైవ్ చేసేటప్పుడు దృష్టి మొత్తం రోడ్డు మీద ఉండాలి. ఏమాత్రం ఆదమరిచినా యాక్సిడెంట్ అవుతుంది. కాళ్లు చేతులు విరుగుతాయి. వాహనం కూడా దెబ్బతింటుంది. తాజాగా అదే జరిగింది. అయితే.. ఇప్పటి వరకు మీరు ఎన్నో యాక్సిడెంట్లను చూసి ఉంటారు కానీ.. ఇటువంటి యాక్సిడెంట్‌ను మాత్రం ఇప్పటి వరకు చూసి ఉండరు. ఎందుకో తెలసుకోవాలంటే మీరు ఈ వీడియోను చూడాల్సిందే.
ఈ యాక్సిడెంట్ యూఎస్‌లోని ఇండియానా రాష్ట్రంలో చోటు చేసుకుంది. అక్కడ జరిగింది ఒక యాక్సిడెంటే కానీ.. మూడు కార్లు దెబ్బతిన్నాయి. ఒక కారుకు అయితే సంబంధం లేకున్నా.. యాక్సిడెంట్లో ఇరుక్కుపోయింది.
ఈ యాక్సిడెంట్ సిగ్నల్ దగ్గర ఆగిన మరో కారులో ఉన్న కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో.. మీరు కూడా చూసేయండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వాట్ ఆన్ ఐడియా సర్జీ.. ట్రెయిన్లో ఈ వ్యక్తి చేసిన పనికి ప్రయాణికులు ఫిదా
భార్య పుట్టినరోజును మరిచిపోతే.. అక్కడ జైలుకు వెళ్లాల్సిందే.. శిక్ష అనుభవించాల్సిందే
వరదల్లో చిక్కుకున్న పూజారిని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసు.. వీడియో వైరల్