ప్రస్తుతం ఏ వస్తువు ధర చూసినా ఆకాశాన్ని అంటుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటేసి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వాటితో పాటు నిత్యావరసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇక.. కూరగాయల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఏ కూరగాయ చూసినా.. కిలో 50కి పైనే. చివరకు ఉల్లిగడ్డలు, బంగాళదుంపల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి.
మరోవైపు టమాటా ధరలు కొండెక్కాయి. దేశం మొత్తం ఎక్కడ చూసినా.. టమాటా కిలో ధర 100కు ఎగబాకింది. కొన్ని ప్రాంతాల్లో వంద దాటింది కూడా. దీంతో ప్రజలు టమాటాలు కొనాలంటేనే భయపడిపోతున్నారు. కిలో టమాటా కొనేబదులు.. హాఫ్ కేజీ చికెన్ కొనుక్కోవడం బెటర్ అని అనుకుంటున్నారు.
టమాటా ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో నెటిజన్లు ఊరుకుంటారా? బయట ఎలాగూ నిరసలు తెలుపలేరు. కనీసం.. సోషల్ మీడియాలో అయినా మీమ్స్ రూపంలో నిరసన తెలుపాలనుకున్నారో ఏమో.. కానీ ట్విట్టర్లో ఎక్కడ చూసినా.. టమాటా ధరలపై మీమ్సే. కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆలోచణాత్మకంగా ఉన్నాయి. మొత్తానికి నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌తో సోషల్ మీడియాను నింపేశారు. అవి చూస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు. టమాటా ధరల గురించి కాసేపు పక్కన పెట్టి ఈ ఫన్నీ మీమ్స్‌ను చూసి కాసేపు హాయిగా నవ్వుకోండి.
Meanwhile Tomato price pic.twitter.com/xp41xpb2fA
— yaarivanu_unknownu (@memesmaadonu) November 22, 2021
Tomato price reaches Rs 100/kg
— Mr.Fixit (@yippeekiyay_dk) November 23, 2021
Meanwhile Nimmo tai pic.twitter.com/ErWU5uDplK
Tomato sold in sachets now, a pack of two tomato pieces is 'Just' Rs. 18 only while 1 kg is sold for 140.#tomatoprice #தக்காளி pic.twitter.com/88MOAOEQHk
— Sanjeevee sadagopan (@sanjusadagopan) November 23, 2021
Malayalee things 😂😂😂
— Vijay Thottathil (@vijaythottathil) November 23, 2021
Felicitated auto driver who returned tomato which fell down in his auto from his passengers bag 😂😂😂 pic.twitter.com/fjd8Z3WeEm
Tomato winning the race ? pic.twitter.com/87pNZiw81q
— Actual India 🇮🇳 (@ActualIndia) November 23, 2021
Tomato price to Petrol and Diesel: pic.twitter.com/gztWsoAjBA
— FingKisher (@Abhesive) November 23, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వాట్ ఆన్ ఐడియా సర్జీ.. ట్రెయిన్లో ఈ వ్యక్తి చేసిన పనికి ప్రయాణికులు ఫిదా
భార్య పుట్టినరోజును మరిచిపోతే.. అక్కడ జైలుకు వెళ్లాల్సిందే.. శిక్ష అనుభవించాల్సిందే
వరదల్లో చిక్కుకున్న పూజారిని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసు.. వీడియో వైరల్
ఫుడ్ ప్రిపేర్ చేశాడు.. రోడ్డు అవతల ఉన్న వ్యక్తి పైకి విసిరేశాడు.. వైరల్ వీడియో
మీరు జీకేలో తోపా.. మీకు ఉచిత ప్రయాణం.. రూపాయి కూడా ఇవ్వాల్సిన పనిలేదు.. ఎలాగో తెలుసా?