ఫుడ్ ప్రిపేర్ చేయడం అనేది ఒక ఆర్ట్. అందరికీ అది చేతగాదు. కొందరు కేవలం తింటారు కానీ వండరు. కొందరికి వండటం మాత్రమే కాదు.. ఇతర స్కిల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ స్ట్రీట్ వెంటర్కు కూడా కొన్ని స్పెషల్ స్కిల్స్ ఉన్నాయి.
అవేంటో తెలుసా? మూకుడులో బీన్స్ ప్రిపేర్ చేసిన స్ట్రీట్ వెండర్.. వెంటనే గ్యాస్ కట్టేసి మూకుడు పట్టుకొని రోడ్డు అవతల ఉన్న వ్యక్తి పైకి వెనుక నుంచి ఆ ఫుడ్‌ను పైకి విసిరేశాడు. వెంటనే అటువైపు ఉన్న వ్యక్తి మరో మూకుడు లాంటి ఓ గిన్నెను పట్టుకొని ఆ ఫుడ్‌ను అందులోకి క్యాచ్ పట్టాడు. ఇదంతా జస్ట్ సెకన్లలో జరిగింది. అది చూసి అక్కడి వాళ్లు ఆశ్చర్యపోయారు. భలేగా చేశావు భయ్యా.. అంటూ నోరెళ్లబెట్టారు.
ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు కూడా మనోడి స్కిల్స్‌కు అబ్బురపడుతున్నారు. కుకింగ్‌లో ఇటువంటి స్కిల్స్ కూడా ఉంటాయా అంటూ షాక్ అవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మీరు జీకేలో తోపా.. మీకు ఉచిత ప్రయాణం.. రూపాయి కూడా ఇవ్వాల్సిన పనిలేదు.. ఎలాగో తెలుసా?
మహిళా ఉద్యోగి వెరైటీ రాజీనామా లెటర్.. కంగుతిన్న బాస్.. ఇంతకీ ఆ లెటర్లో ఏముందో తెలుసా?
ఇంట్లో దూరాడు.. సైకిల్ దొంగతనం చేయబోయాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే నవ్వాపుకోలేరు
ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతున్న మహిళా బెగ్గర్.. వీడియో వైరల్