దొంగతనం చేయడం అంటే అంత ఈజీ కాదు. అది కూడా ఒక ఆర్టే. దొంగతనం చేస్తే మూడో కంటికి కూడా తెలియకూడదు అంటారు. కొందరు దొంగలు అయితే ఎంతో స్మార్ట్‌గా ఉంటారు. దొంగలు కూడా అప్డేట్ అవుతున్నారు మరి. కానీ.. ఈ దొంగ ఇంకా అప్డేట్ కానట్టుంది. లేదంటే కొత్త దొంగ కాబోలు. దొంగతనంలో ఏమాత్రం అనుభవం లేనట్టుంది. అందుకే.. దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఓ దొంగ.. పట్టపగలే ఓ ఇంట్లోకి దూరుతాడు. ఇంటి ముందు వరండాలో బైక్, సైకిల్ పార్క్ చేసి ఉంటాయి. ఆ దొంగకు దేన్ని దొంగతనం చేయాలో అర్థం కాదు. సరే.. ఏదో ఒకటి.. సైకిల్ అయితే ఉంది కదా.. అని దాన్ని దొంగలించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే.. ఇంట్లోకి దొంగ దూరిన విషయాన్ని పసిగట్టిన ఇంటి యజమాని.. వెంటనే బయటికి వెళ్లి ఆ దొంగను వెంబడించి మరీ.. తన సైకిల్‌ను తిరిగి ఇంటికి తెచ్చుకున్నాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోను నెటిజన్లు కట్ చేసి.. కొన్ని సినిమా సీన్లను యాడ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక.. ఆ వీడియోను చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతున్న మహిళా బెగ్గర్.. వీడియో వైరల్
Guinness World Record : గడ్డంతోనే యువతిని అమాంతం పైకి లేపాడు.. వీడియో వైరల్
క్రికెట్ ఆడుతున్న కుక్క.. వింతగా చూస్తున్న స్థానికులు.. వైరల్ వీడియో
టీ పౌడర్‌ను డ్రగ్స్ అనుకొని.. తల్లీకూతుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?