గడ్డంతో ఒక మనిషిని పైకి లేపడం ఎక్కడైనా చూశారా? ఈ వ్యక్తి చేసిన సాహసం చూస్తే నోరెళ్లబెడతారు. తన గడ్డంతో ఏకంగా ఒక మనిషినే లేపి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. యూరప్‌లోని లిథువానియాకు చెందిన ఆంటానస్ కొంట్రిమాస్ ఈ సాహసానికి ఒడిగట్టాడు.
63.80 కిలోల బరువు ఉన్న ఓ యువతి ఓ టేబుల్ మీద పడుకొని అతడి గడ్డాన్ని పట్టుకోగా.. ఆ యువతిని కేవలం గడ్డంతోనే పైకి లేపేశాడు. ఎటువంటి సపోర్ట్ లేకుండా.. కేవలం గడ్డంతోనే ఆ యువతిని పైకి లేపి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించాడు.
ఆ వ్యక్తి చేసిన సాహసానికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిథులు.. తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మీరు మీ గడ్డానికి ఏ ఆయిల్ వాడుతారు. వామ్మో.. ఎంత స్ట్రాంగ్ గడ్డమో.. అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి.. కొంట్రిమాస్ 2013లోనే ఈ రికార్డును క్రియేట్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతడి రికార్డును ఎవ్వరూ బ్రేక్ చేయలేదు. 2021 లో కూడా అదే గడ్డంతో అదే వెయిట్ ఉన్న యువతిని పైకి లేపి.. మరోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డును పదిలం చేసుకున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
క్రికెట్ ఆడుతున్న కుక్క.. వింతగా చూస్తున్న స్థానికులు.. వైరల్ వీడియో
టీ పౌడర్‌ను డ్రగ్స్ అనుకొని.. తల్లీకూతుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రతి రోజు 70 సార్లు వాంతి చేసుకుంటుంది.. ఈ మహిళకు ఉన్న జబ్బేంటో తెలుసా?
రోడ్ల మీద కరెన్సీ నోట్ల వర్షం.. ఏరుకోవడానికి ఎగబడ్డ జనం.. వైరల్ వీడియో
హలో.. నా బాయ్‌ఫ్రెండ్ నాతో మాట్లాడటం లేదు సార్.. పోలీసులకు కాల్ చేసిన మహిళ