మీరు జీకేలో తోపా.. మీకు ఉచిత ప్రయాణం.. రూపాయి కూడా ఇవ్వాల్సిన పనిలేదు.. ఎలాగో తెలుసా?
మీరు జీకేలో తోపా.. మీకు ఉచిత ప్రయాణం | ఫ్రీగా ప్రయాణం అంటే ఈరోజుల్లో కష్టమే. ఎందుకంటే.. పెట్రోల్ డీజిల్ రేట్లు మండిపోతున్నాయి. ఈసమయంలో ఉచితంగా ఎవరు తీసుకెళ్తారు చెప్పండి.
ఫ్రీగా ప్రయాణం అంటే ఈరోజుల్లో కష్టమే. ఎందుకంటే.. పెట్రోల్ డీజిల్ రేట్లు మండిపోతున్నాయి. ఈసమయంలో ఉచితంగా ఎవరు తీసుకెళ్తారు చెప్పండి. కానీ.. ఓ ఈరిక్షా డ్రైవర్ మాత్రం.. తను అడిగే జీకే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే ఉచితంగా తన రిక్షాలో ప్రయాణం చేయొచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

చదవడానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. వెస్ట్ బెంగాల్‌లోని హౌరా జిల్లా లిలువాహ్కు చెందిన సురంజన్ కామర్కర్ ఈరిక్షా డ్రైవర్. రోజూ రిక్షాను నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు.
అయితే.. కామర్కర్కు ఇటీవల ఓ ఆలోచన వచ్చింది. తన రిక్షాలో ప్రయాణించే ప్రయాణికులను కొన్ని ప్రశ్నలు అడిగి వాటికి సరైన సమాధానం చెప్పిన వాళ్ల దగ్గర డబ్బులు కూడా తీసుకోవద్దని అనుకున్నాడు. వెంటనే దాన్ని ఆచరణలో పెట్టడం ప్రారంభించాడు.
ఓరోజు సంకలన్ సర్కార్ అనే ఓ వ్యక్తి తన భార్యతో కలిసి కామర్కర్ ఆటో ఎక్కాడు. వాళ్లు ఆటో ఎక్కగానే.. ఇప్పుడు మిమ్మల్ని 15 జీకే ప్రశ్నలు అడుగుతాను. వాటికి సరైన సమాధానం చెబితే మీ దగ్గర రూపాయి కూడా తీసుకోను. ఉచితంగా మీరు ప్రయాణించవచ్చు.. అని చెబుతాడు.
అతడి మాటలను ముందు సంకలన్ నమ్మడు. కానీ.. సరే.. ముందు ప్రశ్నలైతే అడగనిద్దాం. తర్వాత చూద్దాం అని అనుకున్నాడు సంకలన్. దీంతో కామర్కర్ ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు. మొదటి ప్రశ్నగా.. జనగనమణ జాతీయ గీతాన్ని ఎవరు రాశారు అని అడిగాడు కామర్కర్.
తర్వాత వెస్ట్ బెంగాల్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు అని రెండో ప్రశ్న అడిగాడు. అలా.. 15 ప్రశ్నలు పలు టాపిక్స్ నుంచి అడిగాడట. మొత్తానికి సంకలన్ అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోయాడు కానీ.. ఆ వ్యక్తికి చదువు మీద ఉన్న ఆసక్తిని మాత్రం గమనించాడట.
ఆర్థిక పరిస్థితి వల్ల ఆరో తరగతిలోనే కామర్కర్ చదువు ఆపేశాడట. కానీ.. ఇప్పటికీ రోజూ రాత్రి 2 గంటల వరకు పుస్తకాలు చదివి నిద్రపోతాడట. తనకు చదవడమంటే అంత ఇష్టమట. తనకు ఆ రోజు జరిగిన ఘటనను సంకలన్.. తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా కామర్కర్కు చదువు మీద ఉన్న ఆసక్తి, ఆయనకున్న పరిజ్ఞానాన్ని మెచ్చుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మహిళా ఉద్యోగి వెరైటీ రాజీనామా లెటర్.. కంగుతిన్న బాస్.. ఇంతకీ ఆ లెటర్లో ఏముందో తెలుసా?
ఇంట్లో దూరాడు.. సైకిల్ దొంగతనం చేయబోయాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే నవ్వాపుకోలేరు
ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతున్న మహిళా బెగ్గర్.. వీడియో వైరల్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

