Train hit a man: ట్రాక్ పక్కనే వీడియో కోసం ఫోజు.. వేగంగా ఢీకొట్టిన రైలు.. యువకుడు దుర్మరణం.. వీడియో
Train hit a man: రన్నింగ్ ట్రెయిన్ పక్కన నిలబడి వీడియో తీసుకోవాలన్న ఒక యువకుడి మోజు అతని నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫ్రెండ్ వీడియో తీస్తుండగా ట్రాక్ పక్కన నిలబడి ఫోజు ఇస్తున్న యువకుడిని వేగంగా వచ్చిన రైలు

హోషంగాబాద్: రన్నింగ్ ట్రెయిన్ పక్కన నిలబడి వీడియో తీసుకోవాలన్న ఒక యువకుడి మోజు అతని నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫ్రెండ్ వీడియో తీస్తుండగా ట్రాక్ పక్కన నిలబడి ఫోజు ఇస్తున్న యువకుడిని వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం హోషంగాబాద్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హోషంగాబాద్ జిల్లాలో ఇటార్సీ-నాగ్‌పూర్ రైల్వే లైన్ పక్కనగల శ్రద్ధదేవ్ ఏరియాకు చెందిన సంజు చౌరే (22) సోషల్ మీడియాలో పోస్టు చేయడం కోసం రన్నింగ్ ట్రెయిన్ పక్కన నిలబడి వీడియో తీసుకోవాలని భావించాడు. ఆ మేరకు సంజు చౌరే రైల్వే ట్రాక్ పక్కన నిలబడగా అతని స్నేహితుడు వీడియో తీస్తున్నాడు. ఇది గమనించిన లోకోపైలెట్ గట్టిగా హారన్ మోగిస్తూ వచ్చినా సంజు చౌరే పక్కకు జరుగలేదు. దాంతో రైలు వేగంగా ఢీకొని ఎగిరిపడ్డాడు.
ఒళ్లంతా గాయాలతో స్పృహ లేకుండా పడి ఉన్న అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా, సంజు చౌరేను రైలు ఢీకొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కింది వీడియోలో మీరు కూడా ఆ దృశ్యాలను వీక్షించవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

