తనను తానే పెళ్లి చేసుకుంది.. తర్వాత విడాకులు ఇచ్చుకుంది.. అసలేంటి ఈమె స్టోరీ
తనను తానే పెళ్లి చేసుకుంది | ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటారు పెద్దలు. ఎవరికి నచ్చింది వాళ్లు చేసుకుంటారు. ఎవరి లైఫ్ వాళ్లది కదా.
ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటారు పెద్దలు. ఎవరికి నచ్చింది వాళ్లు చేసుకుంటారు. ఎవరి లైఫ్ వాళ్లది కదా. అందుకే.. కొన్ని విషయాల్లో చివరకు తల్లిదండ్రులు కూడా ఇన్వాల్వ్ అవ్వరు. ఒక వయసు వచ్చాక ఎవరి దారి వారిది. ఎవరి జీవితం వారిది. ప్రశ్నించే హక్కు చివరికి తల్లిదండ్రులకు కూడా ఉండదు. అందుకే.. ఓ యువతి అందరికంటే భిన్నంగా ప్రవర్తించింది. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

బ్రెజిల్‌కు చెందిన క్రిస్ గలెరా అనే 31 ఏళ్ల మోడల్.. గత సెప్టెంబర్‌లో తనకు తానే పెళ్లి చేసుకుంది. అవును.. మీరు చదివింది కరెక్టే. వేరేవాళ్లను కాదు.. తనను తానే పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి కూడా ఘనంగా జరిగింది. తనకు తానే రింగ్ తొడుక్కుంది. బంధువులు, స్నేహితుల సమక్షంలో అంగరంగవైభవంగా పెళ్లి చేసుకుంది. కానీ.. పెళ్లి చేసుకున్న మూడు నెలల్లోనే విడాకులు తీసుకుంది. ఆ విడాకులు కూడా తనకు తానే తీసేసుకుంది. అంటే తనను తాను చేసుకున్న పెళ్లిని రద్దు చేసుకున్నదన్న మాట.
అసలు.. తనకు తానే ఎందుకు పెళ్లి చేసుకుంది.. ఎందుకు విడాకులు తీసుకుంది.. అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. తనకు అంతకుముందు చాలామంది మగవాళ్లతో స్నేహం ఉండేది కానీ.. తనకు ఎవరినీ నమ్మబుద్ధి కాలేదట. తనకు ఒంటరిగా ఉండటం.. ఏకాంతంగా ఉండటమే నచ్చిందట. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా తనకు తానే పెళ్లి చేసుకుంది.
కానీ.. ఇప్పుడు తనకు నచ్చిన వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడట. దీంతో మళ్లీ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తనకు తాను విడాకులు ఇచ్చేసుకుంది. ఇప్పుడిప్పుడే నాకు ప్రేమ మీద నమ్మకం పుడుతోంది. అతడిని కలిశాక అతడితో కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలని అనిపిస్తోంది అని తెలిపింది ఆ యువతి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వాట్ ఆన్ ఐడియా సర్జీ.. ట్రెయిన్లో ఈ వ్యక్తి చేసిన పనికి ప్రయాణికులు ఫిదా
భార్య పుట్టినరోజును మరిచిపోతే.. అక్కడ జైలుకు వెళ్లాల్సిందే.. శిక్ష అనుభవించాల్సిందే
వరదల్లో చిక్కుకున్న పూజారిని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసు.. వీడియో వైరల్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

