బీరు గ్లాస్ ఎలా కిందపడిపోయిందో ఈ వీడియో చూసి చెప్పండి చూద్దాం
బీరు గ్లాస్ ఎలా కిందపడిపోయిందో ఈ వీడియో చూసి చెప్పండి చూద్దాం | ఒక్కోసారి కొన్ని విచిత్ర ఘటనలు జరుగుతుంటాయి. వాటిని చూసి నమ్మాలా? నమ్మొద్దా? అనే ఆలోచనలో పడిపోతాం
ఒక్కోసారి కొన్ని విచిత్ర ఘటనలు జరుగుతుంటాయి. వాటిని చూసి నమ్మాలా? నమ్మొద్దా? అనే ఆలోచనలో పడిపోతాం మనం. తాజాగా అటువంటి ఘటనే ఒకటి యూకేలోని సుందర్లాండ్లో చోటు చేసుకుంది.

స్థానికంగా ఉన్న బ్లూ హౌస్ పబ్‌లో ఓ ఘటన చోటు చేసుకుంది. డార్లా అండర్సన్ అనే ఓ యువతి ఆ పబ్‌ను రన్ చేస్తుంది. ఒక రోజు రాత్రి పూట పబ్‌లో ఇద్దరు ముగ్గురే ఉన్న సమయంలో బీరుతో నిండి ఉన్న గ్లాస్ ఒక్కసారిగా కిందపడిపోయింది. ఆ సమయంలో ఆ గ్లాస్ దగ్గర ఎవ్వరూ లేరు. గ్లాస్‌కు కొంచెం దూరంలో ఓ వ్యక్తి ఉన్నాడు. కానీ.. ఆ వ్యక్తి ఆ గ్లాస్ దగ్గరికి వచ్చిన దాఖలాలు లేవు.
అసలు.. ఎవరి ప్రమేయం లేకుండా ఆ గ్లాస్ ఎలా కిందపడుతుంది. ఎవరో వెనుక నుంచి కిందపడేసినట్టుగా పడిపోయింది అది. ఆ ఘటన పబ్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అవడంతో.. ఆ పబ్ ఓనర్ అండర్సన్.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
దీంతో.. ఆ పబ్‌ను ఇదివరకు నడిపిన.. మాజీ ఓనర్.. అండర్సన్‌కు కాల్ చేసి.. తాము పబ్‌ను నడిపినప్పుడు కూడా ఇటువంటి సంఘటనలే జరిగాయి.. అని చెప్పారట. దీంతో అండర్సన్‌కు లేని భయం పట్టుకుందట. అది హాంటెడ్ పబ్ అని ఆ పబ్‌ను నడిపిన మాజీ ఓనర్ చెప్పడంతో.. అసలు నమ్మాలో నమ్మకూడదో తనకు అర్థం కాలేదట. నెటిజన్లు మాత్రం తమకు తెలిసిన థియరీని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ.. మీకు ఏమైనా తెలిసిందా? నిజంగానే ఆ గ్లాస్‌ను దెయ్యమే పడేసిందంటారా? లేక ఇంకేదైనా కారణం ఉందంటారా?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఇదేందయ్యా ఇది.. జీవితంలో ఇటువంటి యాక్సిడెంట్‌ను ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో
వాట్ ఆన్ ఐడియా సర్జీ.. ట్రెయిన్లో ఈ వ్యక్తి చేసిన పనికి ప్రయాణికులు ఫిదా
భార్య పుట్టినరోజును మరిచిపోతే.. అక్కడ జైలుకు వెళ్లాల్సిందే.. శిక్ష అనుభవించాల్సిందే
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

