కమలాపూర్, అక్టోబర్ 24: హనుమకొండ(Hanumakonda) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన అంకిల్ల కవిత(36) విషజ్వరంతో ఆర్టీసీ బస్సులో(RTC bus) గురువారం మృతి(Woman dies) చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కవిత జ్వరంతో బాధపడుతుండడంతో మూడు రోజుల క్రితం చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తీసుకెళ్లారు.
అక్కడ వైద్యం చేయించుకుని తిరిగి స్వగ్రామానికి భర్త కుమారస్వామితో ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. గూడూరు గ్రామం వద్దకు రాగానే చెమటలు పట్టి స్పృహా కోల్పోయింది. నిద్రపోయి ఉండవచ్చనుకున్న భర్త వంగపల్లి రావడంతో కిందకు దిగేందుకు లేపడంతో లేవలేదు. బస్సులో కూర్చున్న సీటులోనే చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ లుచ్చాగాళ్లకు ఓట్లేయొద్దని మహారాష్ట్రలో చెప్పండి : కేటీఆర్
KTR | ఏడో బెటాలియన్లో కానిస్టేబుళ్ల భార్యల ఆందోళన.. సంఘీభావం ప్రకటించిన కేటీఆర్
KTR | సింగరేణి మీద అదానీ కన్ను.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు