KTR | ఆదిలాబాద్ : సింగరేణి మీద అదానీ కన్ను ఉన్నదని, ఈ దొంగల నుంచి తెలంగాణను కాపాడుకోవాలంటే మనకు ఉన్న ఒకే ఒక్క శక్తి కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్ నాయకత్వంలో నడుద్దాం.. ఈ దొంగల చేతి నుంచి రాష్ట్రాన్ని రక్షించుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నల్లగొండ జిల్లా రామన్నపేటలో అదానీ కొత్త సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో నిన్న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. రామన్నపేట రైతులు, ప్రజలందరూ వేలాదిగా తరలివచ్చి, భారీ ర్యాలీ తీసి.. ఈ కాలుష్య పరిశ్రమ మాకొద్దు.. అదానీ ఫ్యాక్టరీ మాకొద్దు అని నినదించారు. స్థానికంగా ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా అదానీకి కట్టబెడుతారు. బెల్లంపల్లి దేవాపూర్లోని ఓరియంటల్ ఫ్యాక్టరీ మీద కూడా అదానీ కన్ను పడ్డది. దాన్ని అదానీ కొనబోతున్నాడు. దాన్ని బుక్క పెడుతడు. ఇక ఆదిలాబాద్ సీసీఐ తర్వాత సింగరేణిని కూడా బుక్క పెడుతడు. సింగరేణి మీద కూడా అదానీ కన్ను ఉన్నది అని కేటీఆర్ తెలిపారు.
ఈ కాంగ్రెసోళ్లు, బీజేపీళ్లు తోడు దొంగలు. మోదీని రాహుల్ గాంధీ దొంగ అంటడు. మోదీని బడేబాయ్ అని రేవంత్ అంటడు. అదానీ మోసగాడు అని రాహుల్ అంటడు.. రేవంత్ రెడ్డి అదానీ మా దోస్తు అని అంటడు. వీళ్లంతా దందాలు చేసి.. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేసీ దొంగల నుంచి తెలంగాణను కాపాడుకోవాలంటే మనకు ఉన్న ఒకే ఒక్క శక్తి కేసీఆర్ తప్ప ఇంకెవరు దిక్కులేరు. ఎప్పటికైనా ఎన్నటికైనా ఈ రాష్ట్ర రైతాంగానికి, యువతకు, ఆడబిడ్డలకు, వృద్ధులకు శ్రీరామ రక్ష కేసీఆర్ నాయకత్వమే. బీఆర్ఎస్ పార్టీనే అండగా ఉటుంది. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్ నాయకత్వంలో నడుద్దాం.. తెలంగాణను మళ్లీ పట్టాలెక్కిదాం.. ఈ దొంగల చేతి నుంచి రాష్ట్రాన్ని రక్షించుకుందాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
KTR | పత్తికి మద్దతు ధర ఇవ్వకపోతే.. బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ వెంట పడుతాం : కేటీఆర్
KTR | కాంగ్రెస్ లుచ్చాగాళ్లకు ఓట్లేయొద్దని మహారాష్ట్రలో చెప్పండి : కేటీఆర్
KTR | ప్రజలు, రైతుల కోసం జైలుకు పోవడానికి రెడీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు