KTR | ఆదిలాబాద్ : పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఈ నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ లుచ్చగాళ్లకు ఓటేయొద్దని మహారాష్ట్రలో ఉన్న బంధువులకు, దోస్తులకు గట్టిగా చెప్పండి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలోని రామ్లీలా మైదానంలో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నవంబర్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆదిలాబాద్ వాళ్లకు అక్కడ చుట్టాలు, దోస్తులు ఉంటారు. కాంగ్రెస్ లుచ్చగాళ్ల సంగతి వారికి తెలియజెప్పండి.. మేం మోసం పోయాం.. మీరు మోసపోకండి అని చెప్పండి. రైతు భరోసా, తులం బంగారం, పెన్షన్లు, స్కూటీలు అని కథలు చెప్పి ఓట్లు వేయించుకుని మోసం చేశారు. ఈ కాంగ్రెస్ లుచ్చగాళ్లకు ఓట్లేస్తే మళ్లా మోసం జరుగుతదని గట్టిగా చెప్పాలని కేటీఆర్ సూచించారు.
ఈ పోరాటం ఈ రోజుతో ఆగిపోయేది కాదు. ఈ ఆదిలాబాద్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముందుంది. బోరాజ్ చెక్ పోస్టు వద్ద వంటావార్పు చేస్తే నేనొచ్చాను. ఇవాళ ఆదిలాబాద్లో అగ్గి రాజుకుంది. ముఖ్రా కే గ్రామం వద్ద ఆగి సర్పంచ్ మీనాక్షిని పలుకరించాను. రైతులంతా కలిసి పోస్టు కార్డులు కొన్నారు. నీ లుచ్చా మాటలు విని మోసపోయాం. రైతు రుణమాఫీ, రైతుభరోసా, పెన్షన్, తులం బంగారం, స్కూ.. ఎక్కడికి పోయినయ్.. ఎప్పుడు ఇస్తావని రాహుల్ గాంధీకి ఉత్తరం రాశారు. ఆనాడు ఉగ్గుపాలతోనే ఉద్యమాలు నేర్పిన గడ్డ ఆదిలాబాద్.. కుమ్రం భీం పుట్టిన ఈ డ్డలో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పే రోజు వస్తదని కేటీఆర్ అన్నారు.
రుయ్యాడ గ్రామంలో రైతుల మీద కేసులు పెట్టారని తెలిసింది. రుణమాఫీ మోసాన్ని నిరసిస్తూ దిష్టిబమ్మ కాలపెడితే కేసులు పెట్టారు. వాళ్లను జైల్లో పెడుతారట.. రైతులు బాధపడాల్సిన అవసరం లేదు. మీ కోసం మేం జైలుకు వెళ్తాం.. మీరు ఇదే విధంగా మాకు శక్తినివ్వండి.. కాంగ్రెస్ నాయకులతో మేం కొట్లాడుతాం.. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమంలో కొట్లాడినట్టే రేపు కూడా పోరాడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | ప్రజలు, రైతుల కోసం జైలుకు పోవడానికి రెడీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR | మహారాష్ట్రకు వందల కోట్ల నగదు..! కాంగ్రెస్కు ఏటీఎంగా తెలంగాణ : కేటీఆర్
MLC Jeevan Reddy | పార్టీ ఫిరాయింపులను జీర్ణించుకోలేకపోతున్నాను : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి