MLC Jeevan Reddy | పార్టీ ఫిరాయింపులను జీర్ణించుకోలేకపోతున్నాను : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
MLC Jeevan Reddy | తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను జీర్ణించుకోలేకపోతున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని తప్పుబడుతున్నట్టు జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
MLC Jeevan Reddy | హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను జీర్ణించుకోలేకపోతున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని తప్పుబడుతున్నట్టు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీ భవన్లో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి లేఖ రాసినట్లు జీవన్ రెడ్డి తెలిపారు. మానసిక ఆవేదనలో ఉన్నాను.. తీవ్ర మానసిక బాధతో లేఖ రాస్తున్నా.. లేఖ రాస్తున్నందుకు విచారిస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకే ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా నైతిక విలువ పాటించాలి. రాష్ట్ర కాంగ్రెస్‌లోని పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నా. సంఖ్యా బలంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చారు. అయినా కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా చట్టం రూపొందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ పోరాడారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో కొన్ని స్వార్థపూరిత శక్తులు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది. జగిత్యాలలో తన అనుచరురుడు గంగారెడ్డిని పట్టపగలే హత్య చేశారు. ఎవరి అండ చూసుకొని గంగారెడ్డిని చంపారు. పార్టీ ఫిరాయింపుల వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అని జీవన్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | 2 లక్షల ఉద్యోగాలు రాహుల్ ఎరుగు.. ఉన్న ఉద్యోగాలను ఊడపీకుతున్న రేవంత్ సర్కార్: కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

