MLA Anirudh Reddy | మహబూబ్‌నగర్ : తిరుమలలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను అనుమతించకపోతే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణకు రావాల్సిన అవసరం లేదని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో అనిరుధ్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రోళ్లకు మన దగ్గర ఆస్తులు కావాలట. మొన్ననే రూ. 15 వేల కోట్లు తీసుకున్నారు.. అయినా కూడా మనం ఏం అనలేదు. మన ఆస్తులు కావాలి కానీ.. తిరుమలలో మనకు హక్కు లేదట. తిరుమల ముందు తమిళనాడు వాళ్లది ఉండే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఇక్కడ తెలుగు మాట్లాడే వారు ఎక్కువగా ఉన్నారని చెప్పి.. తిరుమలను ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వడం జరిగింది. మనం విడిపోయాక మన సిఫారసు లేఖలు చెల్లవట. కానీ మన ఆస్తులు కావాలట. ఎమ్మెల్యేలందరం కలిసి వీఐపీ లెటర్లు చెల్లేలా ఒత్తిడి తీసుకొస్తాం. లేదంటే చంద్రబాబు నాయుడు మన తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు. ఆస్తుల కోసం, వ్యాపారం కోసం వస్తారు కానీ తిరుమలలో మనకు గౌరవం కల్పించరట. ఆ దేవుడే మీకు బుద్ధి చెప్తారని ఆశిస్తున్నాను అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు మా తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు.
తెలంగాణ ఆస్తులు కావాలి కాని మా తెలంగాణ వారికి తిరుమలలో లెటర్ ప్యాడ్స్ తీసుకోరా?
మొన్ననే మా తెలంగాణ నుండి రూ.15,000 కోట్లు తీసుకెళ్లారు.. అయినా మేమేం అనలేదు.
తిరుమలలో మా లెటర్ ప్యాడ్స్ తీసుకోవాలి.. మమ్మల్ని గెలిపించిన ప్రజలకు… https://t.co/5Tll2voH3P pic.twitter.com/Vhx2cvgOrE
— Telugu Scribe (@TeluguScribe) October 24, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ఏడో బెటాలియన్‌లో కానిస్టేబుల్ భార్యల ఆందోళన.. సంఘీభావం ప్రకటించిన కేటీఆర్
KTR | ఈ రాష్ట్రంలో రైతుగోడు వినే నాథుడే లేడా..? కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించిన కేటీఆర్
KTR | ప్రజలు తిరస్కరించిన వారికి పాలన అప్పచెప్పడమేనా ఇందిరమ్మ రాజ్య అంటే..: కేటీఆర్