KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్నదాతలు పడరాని కష్టాలు పడుతున్నారు. రైతుబంధు ఇవ్వకుండా రైతులను నిండా ముంచారు. చివరకు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు చేయలేదు. ఈ నేపథ్యంలో రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడితే ధాన్యం తడిసిపోతుందని, అప్పుడు కొనేవారు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పంట పెట్టుబడి ఇవ్వడం చేతగాదు.. పంటను కొనుగోలు చేయడం చేతగాదు అని కేటీఆర్ విమర్శించారు. ఈ రాష్ట్రంలో రైతుగోడు వినే నాథుడే లేడా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఏం రాచకార్యాలు వెలగబెడుతున్నారు? అని నిలదీశారు. అన్నదాతల అవస్థలను తీర్చడానికి తీరికలేదా..? ఢిల్లీ టూర్లు, విదేశీ యాత్రలేనా పాలన అంటే..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
పంట పెట్టుబడి ఇవ్వడం చేతగాదు..
పంటను కొనుగోలు చేయడం చేతగాదు..
రాష్ట్రంలో రైతుగోడు వినే నాథుడే లేడా?
ముఖ్యమంత్రి..మంత్రులు ఏం రాచకార్యాలు వెలగబెడుతున్నారు?
అన్నదాతల అవస్థలను తీర్చడానికి తీరికలేదా?
ఢిల్లీ టూర్లు..విదేశీ యాత్రలేనా పాలన అంటే ? pic.twitter.com/UP1lDr1c0q
— KTR (@KTRBRS) October 24, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ప్రజలు తిరస్కరించిన వారికి పాలన అప్పచెప్పడమేనా ఇందిరమ్మ రాజ్య అంటే..: కేటీఆర్
KTR | ఉస్మానియా బిస్కెట్.. ఇరానీ చాయ్.. నాంపల్లిలో కేటీఆర్ సందడి