హైదరాబాద్: నాంపల్లిలోని ఓ ఇరానీ కేఫ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సందడి చేశారు. ఉస్మానియా బిస్కెట్‌తో ఇరాన్ చాయ్‌ని ఎంజాయ్ చేశారు. జనంతో ముచ్చట్లు పెడుతూ అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. కొండా సురేఖపై దాఖలుచేసిన పరువునష్టం దావాలో కేటీఆర్ బుధవారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం బీఆర్ఎస్ నేతలతో కలిసి నాంపల్లిలోని ఏక్‌మినార్ మసీదు వద్దనున్న ఓ ఇరానీ కేఫ్‌లో చాయ్ తాగారు. ఉస్మానియా బిస్కెట్‌ను ఆస్వాదించారు. కేఫ్‌కు వచ్చిన వారితో ముచ్చటించారు. వారితో సెల్ఫీలు దిగారు. తర్వాత పక్కనే ఉన్న బట్టల దుకాణ యజమాని ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి వారితో ముచ్చటించారు.
కాగా, ఎంతో ఇష్టమైన ఉస్మానియా బిస్కెట్ తింటూ ఇరానీ చాయ్ తాగే అవకాశాన్ని ఏ హైదరాబాదీ వదులుకోడు. నాంపల్లిలో నిన్న నేను కూడా అదే చేశా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. వీడియోలు షేర్ చేశారు. ఇప్పుడది సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నది. చాయ్, ఉస్మానియా బిస్కెట్ కాంబినేషన్ ఒక ఎమోషన్ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
No Hyderabadi will ever miss a chance to have a sip of our favourite Irani chai & Osmania biscuit 😊
I did the same @ Nampalli yesterday pic.twitter.com/qGawPhxAOz
— KTR (@KTRBRS) October 24, 2024