హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పాలన అంటే ప్రజలు తిరస్కరించిన వారికి పాలన అప్పచెప్పడమేనా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు లేకుండా, ప్రజా అభిప్రాయానికి విలువ లేకుండా నడపడం నీచమంటూ మండిపడ్డారు. ప్రజా పాలనలో ప్రజల చేత ఎన్నుకోబడిన మమ్మల్ని అభివృద్ధి పనులకు దూరంగా ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారని హైదరాబాద్ సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమలత చేసిన పోస్టుకు ఈ మేరకు స్పందించారు.
తమ హక్కులను కాలారాసేలా తమపై, తమ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్యాలకు ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నదని వాపోయారు. ఒక కార్పొరేటర్‌గా రోడ్డు పరిశీలిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు శంకుస్థాపనలు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ప్రోటోకాల్ వివాదంపై తప్పకుండా హైదారాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. పడగొట్టడాలు, పగ పట్టడంపై ఉన్న శ్రద్ధ పాలనపై చూపాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పాలన అంటే ప్రజలు తిరస్కరించిన వారికీ పాలన అప్పచెప్పడమేనా ?
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు లేకుండా, ప్రజా అభిప్రాయానికి విలువ లేకుండా నడపడం నీచం
Well done Hema 👍 https://t.co/Zi2C33SypL
— KTR (@KTRBRS) October 24, 2024