హైదరాబాద్: కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. 165 మంది ఏఈవోలు, 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. అడ్డగోలు సాకులతో సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హక్కులు అడిగితే వేటు వేస్తారా అని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు రాహుల్ ఎరుగు.. ఉన్న ఉద్యోగాలను రేవంత్ సర్కార్ ఊడపీకుతున్నదని మండిపడ్డారు.
పాపపు పాలనలో ప్రతి బిడ్డా ఆగమేనని చెప్పారు. సామాన్యులతో మొదలు ప్రభుత్వ ఉద్యోగులు సైతం రోడ్లపైకే వస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వమని చెప్పారు. నాడు, నేడు, ఎల్లప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. సస్పెండ్ చేసిన ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
‘పాపపు పాలనలో ప్రతి బిడ్డా ఆగమే..
సామాన్యులతో మొదలు ప్రభుత్వ ఉద్యోగులు సైతం రోడ్ల పైకే.
అడ్డగోలు సాకులతో సస్పెన్షన్లు- హక్కులు అడిగితే వేటేయ్యడాలు.
2 లక్షల ఉద్యోగాలు రాహుల్ ఎరుగు- ఉన్న ఉద్యోగాలను ఊడపీకుతున్న రేవంత్ సర్కార్
165 ఏఈవో లు 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం దారుణం.
బిఆర్ఎస్ అంటే ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం- కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వం.
నాడు, నేడు, ఎల్లప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది.
సస్పెండ్ చేసిన ఉద్యోగులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి,రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
పాపపు పాలనలో ప్రతి బిడ్డా ఆగమే
సామాన్యులతో మొదలు ప్రభుత్వ ఉద్యోగులు సైతం రోడ్ల పైకే. అడ్డగోలు సాకులతో సస్పెన్షన్ లు – హక్కులు అడిగితే వేటేయ్యడాలు
2 లక్షల ఉద్యోగాలు రాహుల్ ఎరుగు – ఉన్న ఉద్యోగాలను ఊడపీకుతున్న రేవంత్ సర్కార్
165 ఏఈవో లు 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం… pic.twitter.com/TGO6H7z14B
— KTR (@KTRBRS) October 24, 2024