ఒకే గొడుగు కిందికి మూడు విభాగాలు
భూ సమస్యల పరిషారంలో జాప్యాన్ని నివారించడానికి ఇక నుంచి రెవెన్యూ, స్టాంప్స్-రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తున్నట్టు రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.
- ఒకే శాఖగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలు
- మంత్రి పొంగులేటి వెల్లడి
హైదరాబాద్, మార్చి 10(నమస్తే తెలంగాణ): భూ సమస్యల పరిషారంలో జాప్యాన్ని నివారించడానికి ఇక నుంచి రెవెన్యూ, స్టాంప్స్-రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తున్నట్టు రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ఒక ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో భూముల సర్వే కోసం అమలుచేస్తున్న పాత పద్ధతులకు స్వస్తి చెప్తూ, అత్యాధునిక రోవర్ పరికరాలతో భూముల సర్వే నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే మండలానికి ఒకటి చొప్పున 460 రోవర్లను కొనుగోలు చేశామని తెలిపారు. వచ్చే బడ్జెట్లో మరో 400 రోవర్ల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ మేరకు రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖలకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు మంత్రి పొంగులేటి అందజేశారు. అనంతరం పలు అంశాలను పొంగులేటి వెల్లడించారు. రాష్ట్రంలో నక్షా (మ్యాప్) లేని 373 గ్రామాల్లో త్వరలోనే రీ-సర్వే చేపట్టనున్నామని, ఇందుకు సంబంధించి 2026-27 బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రిని కోరామని తెలిపారు. ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు నూతన భవనాల నిర్మాణం కోసం అవసరమైన బడ్జెట్ కేటాయించాలని కోరినట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

