U20 Championships | పదేళ్ల క్రితం నీరజ్కు పసిడి.. ఇప్పుడు రజతంతో మెరిసిన అశిష్..!
U20 Championships : ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా(Neeraj Chopra) స్ఫూర్తితో యువ అథ్లెట్లు పతకాలతో మెరుస్తున్నారు. జావెలిన్ త్రోలో భావి తారగా ఎదుగుతున్న అశీష్ యాదవ్(Ashish Yadav) అండర్ 20 ఛాంపియన్షిప్స్లో వెండి వెలుగులు విరజిమ్మాడు.
U20 Championships : ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా(Neeraj Chopra) స్ఫూర్తితో యువ అథ్లెట్లు పతకాలతో మెరుస్తున్నారు. జావెలిన్ త్రోలో భావి తారగా ఎదుగుతున్న అశీష్ యాదవ్(Ashish Yadav) అండర్ 20 ఛాంపియన్షిప్స్లో వెండి వెలుగులు విరజిమ్మాడు. పదేళ్ల క్రితం నీరజ్ పసిడి గెలిచిన చోట అశీష్ రజతంతో మురిశాడు. పురుషుల ఫైనల్లో సత్తా చాటిన ఈ యువకెరటం 74.09 మీటర్ల దూరం ఈటెను విసిరి రెండో స్థానంలో నిలిచాడు.
అమెరికాలోని ఒరెగా వేదికగా జరుగుతున్న అండర్ 20 ఛాంపియన్షిప్స్ 2026లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. జావెలిన్ త్రోలో పదేళ్ల క్రితం నీరజ్ చోప్రా స్వర్ణం కొల్లగొట్టగా.. ఇప్పుడు అశిష్ యాదవ్ రజతం సాధించాడు. 2016లో చోప్రా పసిడితో చరిత్ర సృష్టించగా.. ఆ తర్వాత పలువురు ప్రయత్నించినా పతకానికి ఆమడ దూరంలో నిలిచారు. కానీ, జూనియర్ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న 19 ఏళ్ల అశీష్ అంచనాలు అందుకుంటూ పదేళ్ల నిరీక్షణకు తెరదించాడు.
ASHISH IS WORLD SILVER MEDALIST 🤩🥈
– Ashish Yadav became 2nd Indian after Neeraj Chopra to win medal at World U20 Athletics Championship! 🇮🇳🚀
Best Throw of 74.09m in his 3rd Attempt!
HUGE RESULT FOLKS!!! 🔥🔥🔥🔥🔥 pic.twitter.com/cUSMEmwkCK
— The Khel India (@TheKhelIndia) August 8, 2026
పురుషుల ఫైనల్లో తొలి ప్రయత్నంలో ఈటెను 69.96 మీటర్లు విసిరిన అశీష్.. రెండోసారి ఫౌల్ చేశాడు. ఇక మూడో సారి ఏకంగా 74.09 మీటర్ల దూరంతో రెండో స్థానంలో నిలిచి వెండిని పట్టేశాడు. దక్షిణాఫ్రికాకు చెందిన జాన్ హెండ్రిక్ హేమన్స్ 80.50 మీటర్లతో గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. 73.89 మీటర్లకు పరిమితమైన అడిసన్ జేమ్స్(డోమినికా)కు కాంస్యం దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

