KTR | హైదరాబాద్ : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక సరిహద్దులను మూసేయాలని, భద్రతను కట్టుదిట్టం చేయాలని శివసేన నాయకుడు కిరణ్ పావస్కర్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక నుంచి మహారాష్ట్రకు వందల కోట్ల నగదును తరలించే అవకాశం ఉందని కిరణ్ పేర్కొన్నారు. ఈ నగదును మహా వికాస్ అఘాడీకి ఖర్చు పెట్టే అవకాశం ఉందని తెలిపారు. కిరణ్ లేవనెత్తిన అంశం జాతీయ మీడియాలో ప్రచురితం అయింది. ఈ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ అంశంపై కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని ధ్వజమెత్తారు. ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు నిధులు సమకూర్చతున్నారని కేటీఆర్ ఆరోపించారు.
Telangana has become ATM for Congress
Funding elections in Haryana, Maharashtra and Jharkhand all from the “RR Tax” https://t.co/0ozY8CENTA
— KTR (@KTRBRS) October 24, 2024
ఇవి కూడా చదవండి..
MLC Jeevan Reddy | పార్టీ ఫిరాయింపులను జీర్ణించుకోలేకపోతున్నాను : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
KTR | ప్రజలు తిరస్కరించిన వారికి పాలన అప్పచెప్పడమేనా ఇందిరమ్మ రాజ్య అంటే..: కేటీఆర్