RS Praveen Kumar | హైదరాబాద్ : బెటాలియన్లలో పని చేస్తున్న పోలీసు కానిస్టేబుళ్ల చేత కూలీ పనులు చేయిస్తున్నారని, తక్షణమే వన్ పోలీస్ విధానం అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. బెటాలియన్ల ముందు ధర్నాకు దిగిన కానిస్టేబుళ్ల భార్యలపై మహిళా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆందోళనకు దిగిన మహిళలపై చేయి చేసుకుంటూ బలవంతంగా పోలీసు జీపుల్లో ఎక్కించారు. ఈ ఘటనలపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.
బెటాలియన్లలో కానిస్టేబుల్స్‌గా కొనసాగుతున్న తమ భర్తలకు న్యాయం చేయాలని పోరాడుతున్న వారి భార్యలపై యూనిఫాంలో ఉన్న మరో మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకునే స్థాయికి ఎదిగింది కాంగ్రెస్ పాలనలో ఈ రాష్ట్రం. ఒక గొప్ప చరిత్ర ఉన్న తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్ పరువును రేవంత్ రెడ్డి దిగజార్చారు. రేవంత్ రెడ్డి నిజంగా చరిత్రలో నిలిచిపోతారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇది పూర్తిగా తప్పు.. ఖండించదగ్గ విషయమని ఆయన తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డికి పోలీసు కుటుంబాల గోస వినే సమయం లేనట్లుంది.. కనీసం మీరైనా తక్షణమే స్పందించి, సున్నితమైన ఈ సమస్యను పరిష్కరించాలని డీజీపీని ఆర్ఎస్పీ కోరారు. పోలీసుల మనసుల్లో అశాంతి ఉండకూడదు. పోలీసు బాసులు అశాంతిని దరిచేరనీయకుండా చూడాలన్న విషయం మీకు తెల్వనిది కాదు. ఈ వివాదం మరింత ముదిరితే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మరింత విషమిస్తుంది. ఇప్పటికే పట్టపగలే మర్డర్లు జరుగుతున్న పట్టించుకునే నాథుడే లేడు. అందుకే దయచేసి కొంత కాలం పాత పద్దతి లోనే రికార్డెడ్ పర్మిషన్ (RP) ని కొనసాగించండి. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అప్పుడు కొత్త ప్రయోగం చేయండి అని డీజీపీకి ఆర్ఎస్పీ సూచించారు.
పోలీసులే తమ సోదరుల భార్యలను ఈడ్చుకుంటూ పోవడం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. మనందరి మూడు దశాబ్దాల సర్వీసులో డీజీపీలు ఎవ్వరూ ఈ పరిస్థితిని రానివ్వలేదు. ఎంతో అనుభవం ఉన్న మీరు కూడా ఇలాంటి పరిస్థితి ని రానివ్వరనే ఆశ నాకుంది. దయచేసి ‘ఏక్ పోలీస్’ మీద వేగంగా ఒక కమిటీ వేయండి. ఇప్పుడున్న కన్వర్షన్ సిస్టం అంతగా ఫలితాలు ఇస్తున్నట్లు లేదు. అప్పటి తరానికి ఈ తరానికి చాలా తేడాలున్నాయి.. గమనించగలరు అని డీజీపీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు.
This is absolutely wrong and reprehensible and unprecedented.
తమ భర్తలకు, కుటుంబాలకు న్యాయం కోసం పోరాడుతున్న పోలీసు కానిస్టేబుల్ భార్యపై యూనిఫాం లో ఉన్న మరో పోలీసు కానిస్టేబుల్ చేయి చేసుకునే స్థాయికి ఒక గొప్ప చరిత్ర ఉన్న తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్ ను దిగజార్చారు రేవంత్ రెడ్డి… pic.twitter.com/HsGfQwAXH7— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 24, 2024
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ లుచ్చాగాళ్లకు ఓట్లేయొద్దని మహారాష్ట్రలో చెప్పండి : కేటీఆర్
KTR | ఏడో బెటాలియన్‌లో కానిస్టేబుళ్ల భార్యల ఆందోళన.. సంఘీభావం ప్రకటించిన కేటీఆర్
KTR | సింగరేణి మీద అదానీ కన్ను.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు