KTR | నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆయా బెటాలియన్లలో పని చేస్తున్న పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న నల్లగొండ, నిన్న వరంగల్, ఈరోజు సిరిసిల్ల, డిచ్పల్లి బెటాలియన్ల వద్ద కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ భర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై భార్యలు గళమెత్తారు. వన్ పోలీసింగ్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని ఏడో బెటాలియన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ భార్యలు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. జాతీయ రహదారి 44పై వారు నిరసన తెలిపారు. తమ భర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారంతా డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న కేటీఆర్ మార్గమధ్యలో ఆందోళన చేస్తున్న ఏడో బెటాలియన్ కానిస్టేబుల్ భార్యలకు సంఘీభావం ప్రకటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ బెటాలియన్ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. సాధ్యమైనంత తొందరగా కానిస్టేబుళ్ల సమస్యలను తీర్చాలని సూచించారు. తొందరగా ఈ సమస్యను తేల్చకుంటే పార్టీ తరఫున వారికి అండగా ఉండి.. అవసరమైతే నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని కేటీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా మహిళలు వి వాంట్ జస్టిస్ అంటూ నినదించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనవసరంగా అధికారంలోకి తీసుకొచ్చామని దుమ్మెత్తిపోశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను బలవంతంగా అరెస్టు చేసి, తమ భర్తలను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
డిచ్ పల్లి 7th బెటాలియన్ ముందు ధర్నా చేస్తున్న కానిస్టేబుళ్ల కుటుంబాలకు సంఘీభావం తెలిపి, వారి సమస్యను విన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
బెటాలియన్ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన కేటీఆర్
సాధ్యమైనంత తొందరగా కానిస్టేబుల్ల సమస్యలను తీర్చాలని సూచన
తొందరగా ఈ సమస్యను… https://t.co/p63UFs9xCA pic.twitter.com/POzeEDktfj
— Telugu Scribe (@TeluguScribe) October 24, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ఈ రాష్ట్రంలో రైతుగోడు వినే నాథుడే లేడా..? కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన కేటీఆర్
KTR | ప్రజలు తిరస్కరించిన వారికి పాలన అప్పచెప్పడమేనా ఇందిరమ్మ రాజ్య అంటే..: కేటీఆర్