జగిత్యాల: ఆర్టీసీ బస్సు(RTC bus) మహిళ మృతి చెందిన విషాదకర సంఘటన జగిత్యాల(Jagtial )జిల్లా కేంద్రంలోని కరీంనగర్ వెళ్లే రోడ్డు వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..జగిత్యాలలోని బుడిగజం గాల కాలనీకి చెందిన తూర్పాక తిరుపతమ్మ (40) అనే మహిళ రోడ్డు దాటుతుండగా నిజామాబాద్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన తిరుపతమ్మను స్థానికులు జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..