భోపాల్: ఒక వ్యక్తిపై ట్రాఫిక్ పోలీస్ జులుం ప్రదర్శించాడు. అతడ్ని లాగి కిందపడేశాడు. పైకి లేచిన ఆ వ్యక్తి చెంపపై కొట్టాడు. కాలితో తన్నాడు. (Traffic Cop Kicks Man) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ట్రాఫిక్ పోలీస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. ఆనంద్ నగర్ కూడలి వద్ద గవర్నర్ కాన్వాయ్ వెళ్తుండగా ఒక వ్యక్తి రోడ్డు పక్కగా నిల్చొన్నాడు. అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అతడ్ని చూసి ఆగ్రహం చెందాడు. పరుగున ఆ వ్యక్తి వద్దకు చేరుకున్నాడు. అతడ్ని లాగి కిందపడేశాడు. పైకి లేచి నడిచి వెళ్తున్న ఆ వ్యక్తిని కాలితో తన్నడంతోపాటు అతడి చెంపపై కొట్టాడు.
కాగా, ఒకరు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అకారణంగా ఆ వ్యక్తిపై దాడి చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) దీనిపై స్పందించారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. ఎవరిది తప్పో అన్నది తెలుసుకునేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తామని చెప్పారు.
📍Bhopal | #Watch: Traffic Cop Kicks, Slaps Man As Governor’s Convoy Passes Byhttps://t.co/f5Mt9ES0iB#MadhyaPradesh pic.twitter.com/VZVDzXTg8e
— NDTV (@ndtv) January 19, 2025