Adilabad | బ్యాంకు అధికారుల వేధింపులకు మరో రైతు బలయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బ్యాంకుకు వెళ్లి రైతు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం మరువకముందే అదే జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఉట్నూరు మండలం లింగోజితండా సేవదాస్ నగర్‌కు చెందిన రాథోడ్ గోకుల్ అనే రైతు బ్యాంకు నుంచి రుణం పొందాడు. అయితే ఆ డబ్బును సరైన సమయంలో చెల్లించలేదని ఇటీవల బ్యాంకు అధికారులు ఒత్తిడి చేశారు. బ్యాంకు అధికారుల వేధింపులు తాళలేకఈ నెల 12న రాథోడ్ గోకుల్ పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఇవాళ గోకుల్ తుదిశ్వాస విడిచాడు.]
Jogu Ramanna
రైతు మరణవార్త తెలిసిన వెంటనే మాజీ మంత్రి జోగు రామన్న ఆస్పత్రికి వెళ్లి రైతు కుటుంబసభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. రైతు కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
24 గంటలు గడవకముందే ఆదిలాబాద్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య
ఉట్నూర్ మండలం లింగోజీ తండాకు చెందిన రాథోడ్ గోకుల్ అనే రైతు అప్పుల బాధతో ఈ నెల 12న పురుగుల మందు తాగాడు
గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు https://t.co/WEiwbJ0Jsy pic.twitter.com/WDkwVRaJy0
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2025