శనివారం 06 జూన్ 2020
Telangana - May 17, 2020 , 01:36:21

పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ఇంటినుంచే ?

పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ఇంటినుంచే ?

హైదరాబాద్‌ : పదో తరగతి పరీక్షల మూల్యాంకనాన్ని ఉపాధ్యాయుల ఇంటి నుంచే నిర్వహించేలా ఏర్పాట్లుచేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. సీబీఎస్‌ఈ పరీక్షల మూల్యాంకనం ఉపాధ్యాయులు ఇంటినుంచే నిర్వహిస్తారని కేంద్రప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ఇదే విధానం అమలుచేస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు. పరీక్షల నిర్వహణపై ఈ నెల 19న హైకోర్టు నిర్ణయం తీసుకోనున్నది. ఆ వెంటనే పరీక్షల కాలపట్టిక విడుదలచేసి రెండువారాల్లో పరీక్షలు మొదలుపెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.  


logo