e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News వైభవంగా వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు

వైభవంగా వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు

వైభవంగా వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు

సంగారెడ్డి : జిల్లాలోని సుప్రసిద్ధశైవక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వేదపండితుల వేదమంత్రోచ్ఛరణలతో అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి.

శుక్రవారం గుమ్మడిదల మండలంలోని వీరన్నగూడెంలోని బొంతపల్లి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలను ఈవో శశిధర్‌గుప్తా, వీరన్నగూడెం, బొంతపల్లి ఆలయ వతనుదారులు, మాజీ చైర్మన్ల ఆధ్వర్యంలో అంకురార్పణ చేశారు.


ముందుగా వీరశైవ అర్చకులు సుప్రభాత సేవ చేశారు. మంగళవాయిద్యాలతో వీరభద్రస్వామి వారికి అభిషేకాలు చేశారు. బాలభోగము, తీర్థప్రసాద వినియోగము చేశారు.
ఆలయ కార్యనిర్వాహాణాధికారి శశిధర్‌గుప్తా స్వామి వారికి, భద్రకాళి అమ్మవారికి పట్టు వస్ర్తాలను సమర్పించారు.


మంగళవాయిధ్యాలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. రాత్రి 9 గంటలకు నందీశ్వరవాహన సేవలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారు ఊరేగుతూ భక్తులకు దర్శనమియ్యనున్నారు.

ఇవి కూడా చదవండి..

విషాదం : గోదావరిలో స్నానానికి వెళ్లి ఆరుగురి మృతి

మెదక్‌ చర్చిలో భక్తి శ్రద్ధలతో ‘గుడ్‌ఫ్రైడే’

నిజామాబాద్‌ ఘటనపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి

బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం

నేను క‌రుణానిధి బిడ్డ‌ను.. బీజేపీ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌ను: ‌స్టాలిన్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వైభవంగా వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు

ట్రెండింగ్‌

Advertisement