భోపాల్: పెళ్లి వేడుకలో వరుడికి వధువు షాక్ ఇచ్చింది. అక్కడున్న ప్రియుడి మెడలో పూలమాల వేసింది. ఇది చూసి పెళ్లి అతిథులు నోరెళ్లబెట్టారు. వధువు తీరుతో ఆ పెళ్లిని వరుడు రద్దు చేశాడు. (Bride Garlands Lover) మధ్యప్రదేశ్లోని ఛింద్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 27న రాత్రి వేళ ఉమ్రేత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో పెళ్లి సందర్భంగా గందరగోళం ఏర్పడింది. వరుడు పెళ్లి ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత పూలమాల పట్టుకుని పెళ్లి వేదికపై నిల్చొని ఉన్నాడు.
కాగా, పెళ్లి దుస్తులు ధరించిన వధువు చేతిలోని పూలమాలతో వేదిక వద్దకు చేరుకున్నది. అంతలోనే ఊహించని సంఘటన జరిగింది. పెళ్లికూతురు ఒక్కసారిగా వేదిక నుంచి పరుగెత్తింది. అక్కడున్న ప్రియుడి మెడలో పూలమాల వేసింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిపై దాడికి కొందరు ప్రయత్నించారు. ఇది చూసి వరుడితో పాటు పెళ్లి అతిథులు షాక్ అయ్యారు.
మరోవైపు ఈ సంఘటన తర్వాత ఆ వధువుతో పెళ్లిని వరుడు రద్దు చేశాడు. ప్రియుడితో పెళ్లికి నిరాకరించిన వధువు కుటుంబం ఆమెకు బలవంతంగా పెళ్లి చేసేందుకు ప్రయత్నించినట్లు వరుడి కుటుంబం తెలుసుకున్నది. తమను మోసగించడంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తాము ఆర్థికంగా నష్టపోయామని, సామాజిక అవమానం, మానసిక వేదనకు గురయ్యామని వారు ఆరోపించారు. వరుడి కుటుంబం ఫిర్యాదును పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
الهند أثناء حفل زفاف وصل موكب العريس وصعد على المنصه عشان يتبادل مع العروسه الاكاليل
لكن بينما كان العريس ينتظر ان تضع العروسه الاكليل عليه نزلت هي من على المنصه وهربت نحو حبيبها السابق اللي كان موجود بين الحاضرين ووضعت عليه الاكليل
وقام العريس وأهله بضرب العريس ووقفوا العرس… pic.twitter.com/XzbTcbJ8lD
— مستر (@5_8fm) April 30, 2026
Also Read:
Bengal Repoll | బెంగాల్లోని 285 పోలింగ్ కేంద్రాల్లో 21న రీపోలింగ్, 24న కౌంటింగ్.. ఎందుకంటే?
Watch: స్కూటీని ఢీకొట్టిన కారు.. ఫ్లైఓవర్ పైనుంచి పడి డెలివరీ ఏజెంట్ మృతి