Bengal Repoll | బెంగాల్‌లోని 285 పోలింగ్ కేంద్రాల్లో 21న రీపోలింగ్, 24న కౌంటింగ్.. ఎందుకంటే?
Bengal Repoll | అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో సోమవారం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు. అయితే పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్తా నియోజకవర్గంలో మే 21న రీపోలింగ్ జరుగనున్నది.
కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో సోమవారం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు. అయితే పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్తా నియోజకవర్గంలో మే 21న రీపోలింగ్ జరుగనున్నది. (Bengal Repoll) ఈ నేపథ్యంలో అక్కడి ఫలితాన్ని మే 24న ప్రకటిస్తారు. ఫాల్తా నియోజకవర్గంలోని 285 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సందర్భంగా పలు అవకతవకలు జరిగినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) నిర్ధారించింది. బ్యాలెట్ యూనిట్లపై ఉన్న బటన్లపై నల్ల టేపులు అంటించి ఓ అభ్యర్థికి ఓటు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించింది. అలాగే ఒక నిర్దిష్ట అభ్యర్థికి ఓటు వేసిన వారిని గుర్తించడానికి బ్యాలెట్ యూనిట్ల బటన్లపై పెర్ఫ్యూమ్, సిరా పూసినట్లు నివేదికలో పేర్కొంది.
కాగా, పలు పోలింగ్ కేంద్రాల వద్ద వీడియో ప్రసారంలో సుదీర్ఘ అంతరాలు ఏర్పడినట్లు ఈసీ ధృవీకరించింది. అత్యధిక ఓటింగ్ జరిగే సమయాల్లో స్టోరేజ్ చిప్‌లు ఖాళీగా ఉండటం, సంబంధం లేని ఎన్నికల ఫుటేజీని కలిగి ఉండటంతో పాటు ప్రసార అంతరాలను గుర్తించింది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఓటు వేయకుండా నిరోధించడానికి లేదా బెదిరింపులు, భయపెట్టే ఎత్తుగడలతోపాటు పోలింగ్ కేంద్రాలను బలవంతంగా స్వాధీనం, బూత్ క్యాప్చరింగ్లకు పాల్పడినట్లు, భారీగా నకిలీ ఓటింగ్ జరిగినట్లు ఈసీ ఆరోపించింది.
మరోవైపు ఈ అవకతవకల గుర్తింపుతో పాటు రీపోలింగ్ డిమాండ్ల నేపథ్యంలో ఫాల్తా నియోజకవర్గంలోని 285 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్‌ను ఈసీ రద్దు చేసింది. ఆ పోలింగ్ కేంద్రాల్లో మే 21న రీపోలింగ్ నిర్వహించాలని, మే 24న కౌంటింగ్ నిర్వహించి ఫలితాన్ని ప్రకటించాలని బెంగాల్ ఎన్నికల కమిషనర్‌ను ఈసీ ఆదేశించింది.
Also Read:
Boy Killed For Plucking Watermelons | సొంత పొలంలో పుచ్చకాయలు కోసిన బాలుడు.. హత్య చేసిన కౌలుదారులు
siblings found murdered | ఇటుకలతో కొట్టి నలుగురు పిల్లల దారుణ హత్య.. పరారీలో తల్లి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

