siblings found murdered | ఇటుకలతో కొట్టి నలుగురు పిల్లల దారుణ హత్య.. పరారీలో తల్లి
siblings found murdered | తోబుట్టువులైన నలుగురు పిల్లలను ఇటుకలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఇంటి లోపల నుంచి లాక్ వేసి పారిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పరారీలో ఉన్న పిల్లల తల్లిపై అనుమానం వ్యక్తం చేశారు.
లక్నో: తోబుట్టువులైన నలుగురు పిల్లలను ఇటుకలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఇంటి లోపల నుంచి లాక్ వేసి పారిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పరారీలో ఉన్న పిల్లల తల్లిపై అనుమానం వ్యక్తం చేశారు. (siblings found murdered) ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మురాదాబాద్ మొహల్లాలో తాళం వేసి ఉన్న ఒక ఇంటి లోపల నలుగురు పిల్లల మృతదేహాలు పడి ఉన్నాయని శనివారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు.
కాగా, లోపల నుంచి లాక్ వేసి ఉన్న ఆ ఇంట్లోకి పోలీసులు ప్రవేశించారు. తోబుట్టువులైన నలుగురు పిల్లలను ఇటుకలతో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు గమనించారు. మృతుల్లో ముగ్గురు బాలురు, ఒక బాలిక ఉన్నారు. సఫిక్ (14), సౌద్ (12), ఉమర్ (10), బయాన్ బానో (8)గా వారిని గుర్తించారు. సొంత తోబుట్టువులైన ముస్లిం పిల్లల మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు పిల్లల తల్లి పేరుతో ఆ ఇల్లు రిజిస్టర్ అయినట్లు పోలీసులు తెలుసుకున్నారు. పిల్లలను చంపిన తర్వాత గోడ దూకి ఆమె పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. ఆ ఇంటిని సీజ్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, పరారీలో ఉన్న పిల్లల తల్లి కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. పిల్లల తండ్రి సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడని, గత ఏడాదిగా అతడు తిరిగి రాలేదని చెప్పారు. నలుగురు పిల్లల హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. అయితే ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
4 children found killed in Uttar Pradesh’s Ambedkar Nagar; mother missing: Police pic.twitter.com/SDVV3EovVf
— News Arena India (@NewsArenaIndia) May 2, 2026
Also Read:
Watch: స్కూటీని ఢీకొట్టిన కారు.. ఫ్లైఓవర్ పైనుంచి పడి డెలివరీ ఏజెంట్ మృతి
Watch: ఇంట్లో దూరిన పామును పట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

