Watch: ఇంట్లో దూరిన పామును పట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Snake Catcher Dies After Bitten | ఇంట్లో దూరిన పామును ఒక వ్యక్తి పట్టుకున్నాడు. ఆ తర్వాత అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఆ పాముతో ఆడి రెచ్చగొట్టడంతో అది కాటువేసింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
న్యూఢిల్లీ: ఇంట్లో దూరిన పామును ఒక వ్యక్తి పట్టుకున్నాడు. ఆ తర్వాత అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఆ పాముతో ఆడి రెచ్చగొట్టడంతో అది కాటువేసింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. (Snake Catcher Dies After Bitten) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక బిల్డింగ్లోకి పాము ప్రవేశించింది. పాములు పట్టే వ్యక్తి దానిని పట్టుకున్నాడు. పొడవైన తాచు పామును చేతిలో పట్టుకుని బయటకు తీసుకువచ్చాడు.
కాగా, ఆ వ్యక్తి అతి విశ్వాసంతో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. పామును సంచిలో బంధించే బదులు దానితో ఆటలాడి రెచ్చగొట్టాడు. దీంతో అతడి పట్టు నుంచి తప్పించుకునేందుకు ఆ పాము ప్రయత్నించింది. ఈ సందర్భంగా బుసలు కొట్టి పలుమార్లు అతడ్ని కాటు వేసింది.
మరోవైపు పాము కాటు గాయాన్ని ఆ వ్యక్తి పరిశీలించాడు. ఆ తర్వాత విష పూరిత రక్తాన్ని నాలుకతో చప్పరించాడు. ఈ నేపథ్యంలో పాము విషం అతడి శరీరంలోకి వేగంగా వ్యాపించింది. దీంతో జనం చూస్తుండగా అతడు కుప్పకూలి మరణించాడు.
కాగా, కొందరు వ్యక్తులు ఆ పామును అక్కడి నుంచి తరలించారు. అయితే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అన్నది తెలియలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
The man who came to catch the snake paid a heavy price for playing with it, a painful de**ath in a live video within 3 minutes! pic.twitter.com/usGR3Xx3MI
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 1, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bitten
- Dies
- Fatal
- King Cobra
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

