Watch: స్కూటీని ఢీకొట్టిన కారు.. ఫ్లైఓవర్ పైనుంచి పడి డెలివరీ ఏజెంట్ మృతి
Delivery Agent Falls Off Flyover | డెలివరీ ఏజెంట్ నడుపుతున్న స్కూటీని కారు ఢీకొట్టింది. ఆ వ్యక్తి గాలిలోకి ఎగిరాడు. ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి మరణించాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
న్యూఢిల్లీ: డెలివరీ ఏజెంట్ నడుపుతున్న స్కూటీని కారు ఢీకొట్టింది. ఆ వ్యక్తి గాలిలోకి ఎగిరాడు. ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి మరణించాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Delivery Agent Falls Off Flyover) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాకు చెందిన 25 ఏళ్ల రాజ్‌కుమార్ తన స్నేహితుడు మహావీర్‌తో కలిసి వారం కిందట ఢిల్లీ చేరుకున్నాడు. ఒక ఫుడ్ డెలివరీ కంపెనీలో ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.
కాగా, ఏప్రిల్ 30న ఉదయం 6 గంటలకు తన స్నేహితుడు, రూమ్మేట్ అయిన మహావీర్‌కు రాజ్‌కుమార్ ఫోన్ చేశాడు. రోజూ వెళ్లే టీ స్టాల్‌కు రమ్మని చెప్పాడు. అయితే ఢిల్లీలోని డబ్రి ఫ్లైఓవర్‌పై రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్న అతడి స్కూటీని ఒక కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో రాజ్‌కుమార్ గాలిలోకి ఎగిరాడు. సుమారు 40 అడుగుల ఎత్తులో ఉన్న ఫ్లైఓవర్ పైనుంచి కింద ఉన్న రోడ్డుపై పడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజ్‌కుమార్ మొబైల్‌కు ఫోన్ చేసిన స్నేహితుడు మహావీర్‌కు అతడి మరణం గురించి సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం తర్వాత పారిపోయిన కారు డ్రైవర్‌ను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Update –
CCTV footage has surfaced of a road accident that took place on April 30 at around 6:30 AM on the Dabri flyover in Delhi, in which a 25-year-old delivery boy lost his life. The deceased has been identified as Rajkumar, who worked with Zomato. @DelhiPolice… https://t.co/97CPBMPPTM pic.twitter.com/0QdppDFa4B
— Atulkrishan (@iAtulKrishan1) May 2, 2026
Also Read:
Son suicide, mother hangs | గొడవ తర్వాత కుమారుడు ఆత్మహత్య.. తట్టుకోలేక ఉరివేసుకున్న తల్లి
Watch: ఇంట్లో దూరిన పామును పట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- car
- Delhi
- delivery agent
- Dies
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

