Boy Killed For Plucking Watermelons | సొంత పొలంలో పుచ్చకాయలు కోసిన బాలుడు.. హత్య చేసిన కౌలుదారులు
Boy Killed For Plucking Watermelons | ఒక బాలుడు తన కుటుంబానికి చెందిన పొలంలో పుచ్చకాయలు కోశాడు. అయితే ఆ పొలాన్ని కౌలుకు తీసుకున్న వ్యక్తులు కత్తితో పొడిచి అతడ్ని హత్య చేశారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులను మోహరించారు.
లక్నో: ఒక బాలుడు తన కుటుంబానికి చెందిన పొలంలో పుచ్చకాయలు కోశాడు. అయితే ఆ పొలాన్ని కౌలుకు తీసుకున్న వ్యక్తులు కత్తితో పొడిచి అతడ్ని హత్య చేశారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులను మోహరించారు. (Boy Killed For Plucking Watermelons) ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఈ దారుణం జరిగింది. జగ్నేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోని ఖేడా గ్రామానికి చెందిన ఒక కుటుంబం తమ పొలాన్ని కౌలుకు ఇచ్చారు.
కాగా, మే 1న ఆ కుటుంబానికి చెందిన 13 ఏళ్ల అవనీష్ కుష్వాహా సొంత పొలానికి వెళ్లాడు. ఆ పొలంలోని పుచ్చకాయలను కోశాడు. ఆగ్రహించిన కౌలుదారులు కత్తితో పొడిచి ఆ బాలుడ్ని చంపారు. సోదరుడి కోసం వెతుకుతూ వచ్చిన సోదరి అతడి మృతదేహాన్ని చూసి షాక్ అయ్యింది. తన కుటుంబానికి ఈ విషయం చెప్పింది. ఆ కుటుంబం ఆగ్రహంతో రగిలిపోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. నిందితులైన రియాజుద్దీన్, షిరాజుద్దీన్ను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పలు పోలీస్ స్టేషన్ల నుంచి అదనపు పోలీస్ బలగాలను రప్పించి అక్కడ మోహరించినట్లు వెల్లడించారు.
Also Read:
siblings found murdered | ఇటుకలతో కొట్టి నలుగురు పిల్లల దారుణ హత్య.. పరారీలో తల్లి
Watch: స్కూటీని ఢీకొట్టిన కారు.. ఫ్లైఓవర్ పైనుంచి పడి డెలివరీ ఏజెంట్ మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

