Tamil Nadu Resuts : నటుడు విజయ్ (Actor Vijay) నేతృత్వంలోని టీవీకే పార్టీ (TVK Party) తమిళనాడు (Tamil Nadu) లో సత్తా చాటుతోంది. మొత్తానికి 234 స్థానాలకుగానూ టీవీకే ప్రస్తుతం 90 కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. అధికార డీఎంకే 60 కంటే తక్కువ సీట్లలో మాత్రామే ఆధిక్యంలో కొనసాగుతూ మూడో స్థానానికి పరిమితమైంది. ఇక ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIADMK) గత ఎన్నికలకంటే పుంజుకుని ప్రస్తుతం 70 కిపైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అయితే ప్రస్తుత లీడ్స్‌ను బట్టిచూస్తే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ (Magic figure) దక్కే అవకాశం కనిపించడంలేదు. కానీ విజయ్ టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచే ఛాన్స్ ఉంది.
ఎర్లీ ట్రెండ్స్‌లో మెజారిటీ స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తూ డీఎంకే దూసుకుపోయింది. ఒక దశలో ఆ పార్టీ 140 స్థానాలకుగానూ 74 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబర్చింది. ఆ తర్వాత చాలా స్థానాల్లో టీవీకే అభ్యర్థులు లీడ్‌లోకి రావడంతో డీఎంకే స్కోర్ క్రమంగా పడిపోతూ 60 దిగువకు చేరింది. ఇక 30 స్థానాలకు అటుఇటుగా లీడ్లతో ఉన్న టీవీకే, అన్నాడీఎంకే అమాంతం పైకి దూసుకొచ్చాయి. ఇప్పుడు టీవీకే 80 కిపైగా స్థానాల్లో, అన్నాడీఎంకే 70 కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఈ ట్రెండ్‌ను బట్టి చూస్తే మెజారిటీ ఎగ్జిట్‌పోల్ సంస్థలు వేసిన అంచనాలు తలకిందులయ్యాయి.
మెజారిటీ ఎగ్జిట్‌పోల్ సంస్థలు అధికార డీఎంకేనే వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తుందని స్పష్టంచేశాయి. ఒకటిరెండు సర్వే సంస్థలు మాత్రమే టీవీకే సత్తా చాటబోతోందని తెలిపాయి. చివరికి ఆ ఒకటిరెండు సంస్థలు వేసిన అంచనాలే నిజమయ్యాయి. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేకపోవడంతో టీవీకే పార్టీ.. ప్రతిపక్ష అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. డీఎంకే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ఒకటిరెండు ఎగ్జిట్‌పోల్ సంస్థలు టీవీకే హవా చాటుతుందని చెప్పినప్పటి నుంచే అన్నాడీఎంకే నేతలు.. టీవీకేతో పొత్తుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
కానీ టీవీకే వారి ప్రయత్నాలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఫలితాలను బట్టిచూస్తే టీవీకే, అన్నాడీఎంకే పార్టీ మధ్య పొత్తు ఖాయమని అనిపిస్తోంది. ఎందుకంటే విజయ్.. డీఎంకే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. అటు డీఎంకే కూడా పోటీలోకి వచ్చిన విజయ్‌ని ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. కాబట్టి టీవీకే, డీఎంకే పొత్తుపెట్టుకునే అవకాశాలు లేనట్లే. కాబట్టి టీవీకే, అన్నాడీంఎకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.