Rovman Powell : క్రికెట్ మైదానంలో మెరుపు ఫీల్డర్లను చూశాం. అమాంతం గాల్లోకి ఎగిరి కష్టసాధ్యమైన క్యాచ్‌లు పట్టే ఆటగాళ్లను చూసి అచ్చెరువొందాం. అప్పట్లో జాంటీ రోడ్స్(Jonty Rhodes), సురేశ్ రైనా, కైఫ్.. ఈ తరంలో గ్లెన్ ఫిలిప్స్, శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) స్టన్నింగ్ క్యాచ్‌లు పడుతున్నారు. ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో మొన్న అయ్యర్ బౌండరీ లైన్ వద్ద నమ్మశక్యంకాని క్యాచ్ పట్టగా.. ఉప్పల్ స్టేడియంలో రొవ్మన్ పావెల్ (Rovman Powell) కళ్లుచెదిరే ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు.
ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ బౌండరీ లైన్ వద్ద అందుకున్న క్యాచ్‌ను అభిమానులు ఇంకా మరువలేదు. రింకూ సింగ్ ఫీల్డింగ్ విన్యాసాలను చూసి తరించిన ఫ్యాన్స్‌ను తనవైపు లాగేసుకున్నాడు పావెల్. పవర్ హిట్టరైన ఈ కరీబియన్ క్రికెటర్.. కోల్‌కతా నైట్ రైడర్స్ బెస్ట్ ఫీల్డర్‌గా అవతరించాడు. ఉప్పల్ స్టేడియంలో 9 ఓవర్లకే వంద కొట్టిన సన్‌రైజర్స్ 165కే ఆలౌటవ్వడంలో బౌలర్ల కృషితో పాటు పావెల్ స్టన్నింగ్ క్యాచ్‌కు భాగముంది.
ONE-HANDED STUNNER! 🤯
Rovman Powell loses his shades but keeps his hold on the ball 👏👏
Is this your 𝘤𝘢𝘵𝘤𝘩 𝘰𝘧 𝘵𝘩𝘦 𝘴𝘦𝘢𝘴𝘰𝘯? 🤔
Updates ▶️ https://t.co/muersQO7at#TATAIPL | #KhelBindaas | #SRHvKKR | @Ravipowell26 pic.twitter.com/xnOdjScT3e
— IndianPremierLeague (@IPL) May 3, 2026
చూడ్డానికి దిట్టంగా ఉండే పావెల్ సిక్సర్లతో వార్తల్లో నిలుస్తాడనకుంటే ఖతర్నాక్ ఫీల్డింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. సన్‌రైజర్స్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ గాల్లోకి లేపిన బంతిని కుడివైపు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో ఒడిసిపట్టిన తీరు అమోఘం అంటున్నారు నిపుణులు. గ్రీన్ ఓవర్లో వరసగా 6, 4 బాదిన క్లాసెన్ మిడ్వికెట్లో సిక్సర్ కొట్టాలనుకున్నాడు.
కానీ, పావెల్ మెరికలా కదిలిన పావెల్ కుడివైపు డైవ్ చేస్తూ బంతిని ఒంటిచేత్తో అందుకున్నాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పి కిందపడినా.. నేలకు తల గట్టిగానే తగిలినా అతడు బంతిని వదల్లేదు. పావెల్ క్యాచ్ పట్టిన తీరుకు కామెంటేటర్లతో పాటు సన్‌రైజర్స్ అభిమానులూ ఫిదా అయ్యారు. కోల్‌కతా స్టార్ ఈ సీజన్లో ఇలాంటి నమ్మశక్యంకాని క్యాచ్ పట్టడం ఇది రెండోసారి.
2⃣ 𝗔𝗕𝗦𝗢𝗟𝗨𝗧𝗘 𝗦𝗧𝗨𝗡𝗡𝗘𝗥𝗦 in back-to-back matches 🤯
Which Rovman Powell blinder is your favourite? 🫴 🤔
VOTE in the comments! 👇#TATAIPL | #KhelBindaas | #SRHvKKR | @Ravipowell26 | @KKRiders pic.twitter.com/rVxiIxKaDF
— IndianPremierLeague (@IPL) May 3, 2026
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్ గాల్లోకి లేపిన బంతిని సైతం పావెల్ ఒడిసిపట్టాడు. బంతిని నిశితంగా గమనించి.. వెనక్కి వెళ్తూ.. కింద పడి మరీ క్యాచ్‌ను పూర్తి చేశాడీ ఆల్‌రౌండర్. అప్పుడు మార్ష్ క్యాచ్‌తో వైరలైన పావెల్.. ఇప్పుడు క్లాసెన్‌ను పెవిలియన్ పంపేందుకు తన ఫీల్డింగ్ విన్యాసాన్ని కనబరిచాడు. దాంతో.. అతడు అద్భుతంగా పట్టిన ఈ రెండు క్యాచుల్లో ఏది ఉత్తమం? అంటూ అభిమానులను ఆలోచనల్లో పడేసింది ఐపీఎల్ యాజమాన్యం.