Bandi Sanjay : ఇటీవల కేంద్ర ప్రభుత్వం (Union Govt) ప్రకటించిన పద్మ అవార్డుల (Padma Awards) విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అడ్డదిడ్డంగా మాట్లాడారు. గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తామంటూ ఆయనను అవమానించేలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పద్మ’ అవార్డుల కోసం జాబితాను పంపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పంపాలని, గద్దర్‌కు ఎట్లా పద్మ అవార్డు ఇస్తామని ఆయన ప్రశ్నించారు. ‘గద్దర్ ఎంత మంది బీజేపీ కార్యకర్తలను కాల్చి చంపించారో తెలియదా..?’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేసిన వందల మంది బీజేపీ కార్యకర్తలను నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్ అని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్‌తో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తోందని, తెలంగాణ సెంటిమెంట్‌తో ఎవరు లాభపడ్డారో.. ఎవరు బలైపోయారో ప్రజలందరికీ అర్థమైందని అన్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
తాము గోరటి వెంకన్న, గద్దర్, జయధీర్ తిరుమలరావు, చుక్కా రామయ్య, అందెశ్రీ పేర్లు సిఫార్సు చేసినా కేంద్రం పట్టించుకోలేదని రేవంత్ విమర్శించారు. ఏపీకి 5 అవార్డులు ఇచ్చారని, తెలంగాణకు నాలుగైనా ఇవ్వాల్సిందని అన్నారు. పద్మ అవార్డుల విషయంలో చూపిన వివక్షపై కేంద్రానికి లేఖ రాస్తానని సీఎం అన్నారు. సీఎం వ్యాఖ్యలపై తాజాగా బండి సంజయ్ ఈ హాట్ కామెంట్స్ చేశారు. పద్మ అవార్డులు అర్హులకే వచ్చాయని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం మంచి పేర్లు పంపితే కేంద్రం పరిశీలిస్తుందని, ఏ పేరు పడితే ఆ పేరు పంపితే పద్మ అవార్డులు ఇవ్వరని సంజయ్ అన్నారు. ‘గద్దర్‌కి పద్మ అవార్డు ఎలా ఇస్తాం..? ఆయన భావజాలం ఏంటి..? బరాబర్ గద్దర్‌కు ఇవ్వం. ఎందరో బీజేపీ నేతలను చంపిన వ్యక్తుల్లో గద్దర్ ఒకరు. పద్మ అవార్డులు స్థాయి ఉన్న వారికే ఇస్తాం. బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తాం..? అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Brain Stroke | మానసిక ఒత్తిడి, ఒంటరితనం.. విడిపోయిన దంపతుల పిల్లలకు స్ట్రోక్ ముప్పు!
Suryapeta | ఆర్నెళ్ల కింద కులాంతర వివాహం.. యువకుడి దారుణ హత్య
Tribal King | రిపబ్లిక్ డే వేడుకలకు తొలిసారి ఓ ట్రైబల్ కింగ్.. ఆ రాజు ఎవరో తెలుసా..?