Suryapeta | సూర్యాపేట : ఆర్నేళ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో మూసీ కెనాల్ కట్టపై చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ.. ఆరు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. అయితే ఆదివారం రాత్రి కృష్ణకు ఓ వ్యక్తి ఫోన్ చేసి బయటకు రావాలని చెప్పాడు. దీంతో అతను ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. పిల్లలమర్రికి వెళ్లే మూసీ కెనాల్ కట్టపై శవమై తేలాడు.
సమాచారం అందుకున్న భార్య, కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి వెళ్లారు. కృష్ణ మృతదేహాన్ని చూసి భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాళ్లగడ్డకు చెందిన మహేశ్ అనే వ్యక్తి ఫోన్ చేయడంతో తన భర్త బయటకు వెళ్లినట్లు మృతుడి భార్య తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాతకక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్
సూర్యాపేటలో దారుణ హత్య
సూర్యాపేటలోని మామిళ్ళ గడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుడిని బండ రాళ్లతో మోది దారుణ హత్య
జనగామ రహదారి నుంచి పిల్లలమర్రికి వెళ్లే మూసి కెనాల్ కట్టపై పడి ఉన్న మృతదేహం
ఆరు నెలల కిందట కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న కృష్ణ pic.twitter.com/Mtmivwj27r
— Telugu Scribe (@TeluguScribe) January 27, 2025
ఇవి కూడా చదవండి..
Housing Board | విక్రయానికి హౌసింగ్‌బోర్డ్ ఆస్తులు.. దిల్ భూములపై రేవంత్ సర్కార్ కన్ను!
Indiramma Indlu | ఒకే పథకాన్ని ఎన్నిసార్లు.. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌ను మళ్లీ ప్రారంభించిన రేవంత్