Chilkapalli village : మన దేశానికి స్వాతంత్య్రం (Independence) వచ్చి సుమారుగా 78 ఏళ్లు పూర్తయ్యింది. ఈ ఎనిమిది దశాబ్దాల్లో దేశంలో ఎంతో అభివృద్ధి జరిగింది. దాదాపు అన్ని రంగాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. అయితే వివిధ రాష్టాల్లోని కొన్ని మారుమూల గ్రామాలకు మాత్రం ఇంకా అన్ని రకాల అభివృద్ధి ఫలాలు అందలేదు. ఇప్పటికీ సరైన రవాణా సౌకర్యం (Tranport availability), తాగునీటి వసతి (Drinking water fecility) లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం (Chattishgarh state) బీజాపూర్ జిల్లా (Bijapur district) కు చెందిన చిల్కపల్లి గ్రామం (Chilkapally village) కూడా ఆ కోవకు చెందినదే. చిల్కపల్లి గ్రామానికి రవాణా, తాగునీటి సంగతి దేవుడెరుగు.. ఇప్పటిదాకా కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 78 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ గ్రామం విద్యుత్ వెలుగులకు నోచుకున్నది. బీజాపూర్ జిల్లా కలెక్టర్ సంబిట్ మిశ్రా ఈ నెల 23న చిల్కపల్లి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించారు.
దాంతో చిల్కపల్లి గ్రామ ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. చాన్నాళ్ల తర్వాత తమ ఇళ్లలో విద్యుత్ వెలుగులను చూసుకుని సరికొత్త అనుభూతి చెందుతున్నారు. జనవరి 23 నుంచి చిల్కపల్లి గ్రామానికి విద్యుత్ వెలుగులు మొదలయ్యాయని సంబిట్ మిశ్రా చెప్పారు. నియాద్ నెల్నార్ పథకం కింద ఆ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ పథకం కింద విద్యుత్ సౌకర్యం పొందిన ఆరో గ్రామం చిల్కపల్లి అని మిశ్రా వెల్లడించారు.
#WATCH | Bijapur, Chhattisgarh | Bijapur Collector Sambit Mishra says, “Chilkapalli village recieved electricity on 23rd January. This is the 6th village under the Niyad Nellnar Scheme where we have provided electricity facilities…” https://t.co/MVYFBQU65R pic.twitter.com/HzuGu6qDot
— ANI (@ANI) January 27, 2025
Brain Stroke | మానసిక ఒత్తిడి, ఒంటరితనం.. విడిపోయిన దంపతుల పిల్లలకు స్ట్రోక్ ముప్పు!
Suryapeta | ఆర్నెళ్ల కింద కులాంతర వివాహం.. యువకుడి దారుణ హత్య
Tribal King | రిపబ్లిక్ డే వేడుకలకు తొలిసారి ఓ ట్రైబల్ కింగ్.. ఆ రాజు ఎవరో తెలుసా..?