Brain Stroke | న్యూఢిల్లీ, జనవరి 26: మానసిక ఒత్తిడి, ఒంటరితనం.. ఇవి ఓ వ్యక్తి బ్రెయిన్ ‘స్ట్రోక్’ బారినపడే ముప్పును పెంచుతాయి. ఇవే కాకుండా..విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలకు కూడా ‘స్ట్రోక్’ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. యూనివర్సిటీ ఆఫ్ టొరొంటో సైంటిస్టులు 65 ఏండ్ల పైబడ్డ 13 వేల మంది నుంచి డాటాను సేకరించి ఓ నివేదికను తయారుచేశారు. దీని ప్రకారం, ఓ వ్యక్తి స్ట్రోక్ బారిన పడటానికి తల్లిదండ్రుల విడాకులకు సంబంధముంది.
తల్లిదండ్రులు విడిపోవటమన్నది పిల్లల వయస్సు 18 ఏండ్ల దాటకముందే జరిగితే, అలాం టి కుటుంబాల్లోని పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యాక…60 శాతం మందికి స్ట్రోక్ వచ్చే ప్రమాదముంది. తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్న పిల్లలతో పోల్చితే విడిపోయిన కుటుంబాల్లో వృద్ధులు ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు.