Tungabhadra Dam | జోగులాంబ గద్వాల : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 3 గేట్లను అధికారులు ఎత్తేశారు. ఎగువ నుంచి భారీగా వరద పరవళ్లు తొక్కుతుండటంతో ముందస్తుగా సోమవారం సాయంత్రం 3 గేట్లు ఎత్తి వరద నీటిని తుంగభద్ర నదిలోకి విడుదల చేస్తున్నారు.
తుంగభద్ర డ్యాంకు 1,01,993 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. అవుట్ ఫ్లో 7,744 క్యూసెక్కులు నమోదైంది. ప్రస్తుతం డ్యాంలో 87.056 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 1628.09 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు టీబీ డ్యాం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1628.09 అడుగులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
భారీ వరద నేపథ్యంలో ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు దిగువన ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తుంగభద్ర డ్యాం గేట్లు తెరవడంతో.. కృష్ణా నదిలోకి వరద పోటెత్తింది. దిగువన ఉన్న శ్రీశైలంకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.
ఇవి కూడా చదవండి..
Oppo K12x 5G | 29న భారత్ మార్కెట్లో ఒప్పో కే12ఎక్స్ 5జీ ఫోన్ లాంచింగ్.. !
Maheshwar Reddy | మంత్రి పొంగులేటిపై బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి సంచలన ఆరోపణలు..!
Harish Rao | ఆ నిబంధనల వల్లే రుణమాఫీ కావట్లేదు.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఆగ్రహం