Oppo K12x 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ ఏడాది ప్రారంభంలో చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్ భారత్ మార్కెట్లో ఈ నెల 29న ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్‌ను రీబ్రాండ్ చేసి ఒప్పో కే12ఎక్స్ 5జీ ఫోన్ గా ఆవిష్కరిస్తున్నారని తెలుస్తోంది.

ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్లో సర్క్యులర్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తోపాటు వెర్టికల్ పిల్ షేప్డ్ మాడ్యూల్లో డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. బ్రీజ్ బ్లూ, మిడ్ నైట్ వయోలెట్ రంగుల్లో లభిస్తుందీ ఫోన్. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+స్క్రీన్ కలిగి ఉంటుంది. వర్షంలోనూ చేతులు తడిగా ఉన్నప్పుడు వాడటానికి వీలుగా స్ప్లాష్ టచ్ టెక్నాలజీకి మద్దతుగా ఉంటుంది. ట్వైస్ రీఇన్ ఫోర్స్డ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తోంది. డ్యుయల్ వ్యూ వీడియో ఫీచర్‌కు మద్దతుగా ఏఐ లింక్ బూస్ట్ టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది. యూజర్లు ఫ్రంట్, రేర్ కెమెరాలతో ఒకేసారి వీడియో రికార్డ్ చేయొచ్చు. 45వాట్ల వైర్డ్ సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోందీ ఫోన్.
Best Family Cars | రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ ఫ్యామిలీ కార్లివే.. !
Union Budget | 1947 నుంచి 2024 వరకూ బడ్జెట్లో మార్పులూ చేర్పులూ ఇలా..
Union Budget 2025 | కొలువుల కల్పనే కష్టం.. నిర్మలమ్మ ‘బడ్జెట్’ ముందు సవాళ్లివే..!
Union Budget 2024-25 | ఏడో బడ్జెట్‌తో ఆయన రికార్డుకు విత్త మంత్రి నిర్మలమ్మ బ్రేక్..?