BRS Party | మూసీ ప్రక్షాళన కంటే ముందు.. నీ నోటిని ప్రక్షాళన చేసుకో.. రేవంత్‌కు బీఆర్ఎస్ స్ట్రాంగ్ వార్నింగ్
BRS Party | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. గుంపు మేస్త్రీ.. మూసీ ప్రక్షాళన కంటే ముందు.. నీ నోటిని ప్రక్షాళన చేసుకో అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా హెచ్చరించింది.
BRS Party | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. గుంపు మేస్త్రీ.. మూసీ ప్రక్షాళన కంటే ముందు.. నీ నోటిని ప్రక్షాళన చేసుకో అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా హెచ్చరించింది. సున్నాలు, కన్నాలు వేసే రేవంతూ.. నీ మతిలేని చర్యలతో హైదరాబాద్ మహానగర పరువు తీస్తున్న కాంగ్రెస్ పార్టీ, నువ్వు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కొన్ని ప్రశ్నలు సంధించింది. వాటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేసింది.
మూసీపై రేవంత్‌ను సూటిగా అడిగిన ప్రశ్నలు..
1. బీఆర్ఎస్ హయాంలో ప్రణాళికలు రూపొందించిన మూసీ పునరుజ్జీవ, సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 16,500 కోట్లు.. ఇప్పుడు అది అమాంతం ఎందుకు పెరిగినట్లు?
2. అదే ప్రాజెక్టుకు తట్ట మట్టి ఎత్తకుండా వ్యయాన్ని రూ. 16,500 కోట్ల నుండి రూ. 1,50,000 కోట్లకు ఎందుకు పెంచినట్లు?
3. పెరిగిన ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎవరి జేబులు నింపడానికి?
4. మొదట మూసీ సుందరీకరణకు రూ. 50,000 కోట్లు అవసరమని నువ్వే అన్నావ్.. ఇప్పుడు అదే నోటితో రూ. 1,50,000 కోట్లు కావాలి అంటున్నావ్. అది నోరా.. లేక మోరా?
5. 3-4 నెలల్లోనే లక్ష కోట్ల వ్యయం ఎలా పెరిగింది. ఈ సొమ్ము అంతా ఢిల్లీకి కప్పం కట్టడానికా?
6. పనులు మొదలవ్వకముందే అంచనాలు పెంచి.. ప్రజల సొమ్మును పందికొక్కుల్లాగ తినడం కాంగ్రెస్ పార్టీకి పరిపాటి. ఈ మూసీ ప్రాజెక్టు కూడా ఆ కోవలోకి చెందిందేనా?
ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేయకుండా పూటకో మాట మార్చి నోటికొచ్చింది ఒర్రకు. ఇట్లనే ఒర్రుకుంట పోతే రంగు పడుద్ది! అని రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించింది.
సున్నాలు, కన్నాలు వేసే రేవంతూ.. నీ మతిలేని చర్యలతో హైదరాబాద్ మహానగర పరువు తీస్తున్న కాంగ్రెస్ పార్టీ, నువ్వు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు.
ముందు నీకు కొన్ని ప్రశ్నలు 👇🏼
1. బీఆర్ఎస్ హయాంలో ప్రణాళికలు రూపొందించిన మూసీ పునరుజ్జీవ, సుందరీకరణ ప్రాజెక్టు… https://t.co/MkNHzbmeiJ pic.twitter.com/UIzAZfVMee
— BRS Party (@BRSparty) July 22, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఆ నిబంధనల వల్లే రుణమాఫీ కావట్లేదు.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఆగ్రహం
KTR | కొత్త న్యాయ చట్టాలపై రేవంత్ ప్రభుత్వం వైఖరేంటో చెప్పాలి : కేటీఆర్
BSNL 4G | కొత్తగా వెయ్యి 4జీ టవర్లను ఇన్స్టాల్ చేసిన బీఎస్ఎన్ఎల్..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

