BSNL 4G | బీఎస్ఎన్ఎల్ టెలికం సంస్థ వినియోగదారులకు గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించబోతున్నది. దీనికి ముందు పెద్ద ఎత్తున 4జీ టవర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారంలో వెయ్యి 4జీ టవర్లను ఇన్స్టాల్ చేసిన బీఎస్ఎన్ఎల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా వెల్లడించింది. 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం దేశవ్యాప్తంగా సుమారు 1.12లక్షల టవర్లను ఇన్స్టాల్ చేయనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వరంగ టెలికం కంపెనీ 12వేల వరకు టవర్లను ఇన్స్టాల్ చేసింది. ఇందులో పంజాబ్‌లో 6వేలు, ఉత్తరప్రదేశ్ వెస్ట్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా సర్కిల్లో యాక్టివ్‌లో ఉన్నాయి.
4జీ సర్వీసుల కోసం బీఎస్ఎన్ఎల్ టీసీఎస్, తేజస్ నెట్వర్క్, ప్రభుత్వ ఐటీఐతో భాగస్వామ్యం కలిగి ఉన్నది. ఈ నెల ప్రారంభంలో తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో బీఎస్ఎన్ఎల్ 4జీని కొత్తగా లాంచ్ చేసింది. నోచిలి, కొలత్తూరు, పల్లిపేట్, తిరువెల్లావోయల్, పొన్నేరి తదితర ప్రాంతాల్లో సేవలు మొదలయ్యాయి. త్వరలో తమిళనాడు రాజధాని చెన్నైలో 4జీ అందుబాటులోకి వస్తుందని బీఎస్ఎన్ఎల్ అధికారులు ధ్రువీకరించారు. లాంచింగ్ అనంతరం కంపెనీ వినియోగదారులకు కంపెనీ వినియోగదారులకు ఉచితంగా సిమ్‌కార్డులను ఇస్తున్నది. ఇప్పటికే కొత్త సిమ్ కార్డులున్న యూజర్లు 4జీ అప్‌గ్రేడ్ సదుపాయం పొందనున్నారు. ఈ లాంచ్ ఆఫర్ మూడు నెలల పాటు అందుబాటులో అందుబాటులో ఉండనున్నది.